Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jun 2024 09:09 IST

1. లోకేశ్‌ పాదయాత్ర... తెదేపా విజయయాత్ర..!

రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో తెదేపా అసాధారణ విజయానికి దోహదం చేసిన ప్రధాన అంశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కీలకమైంది. వైకాపా అరాచకాలను ఎండగట్టడం, తెదేపాను మరింతగా ప్రజలకు చేరువ చేయడం, పార్టీలో యువనాయకత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభించిన లోకేశ్‌ పాదయాత్రకు విశేషమైన స్పందన లభించింది. పూర్తి కథనం

2. ఉక్కిరిబిక్కిరి చేసిన ‘ఇండియా’

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఊహించని పాటవంచూపి భాజపాతో పాటు, స్టాక్‌మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. విడివిడిగా చూస్తే బలహీనంగా కనిపించిన పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి సవాల్‌ విసిరాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజార్టీ భాజపాకు దక్కకుండా నిలువరించగలిగాయిపూర్తి కథనం

3. రాశి.. వాసితో కమల వికాసం

రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకు బలాన్ని పెంచుకుంటూ భాజపా బలమైన శక్తిగా ముందుకు వెళ్తోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది. పదేళ్లలో పార్టీ రాష్ట్రంలో ఓట్లను... సీట్లను గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడి ఎనిమిది చోట్ల నెగ్గి.. మరో ఏడు స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది.పూర్తి కథనం

4. పవన్‌ శక్తి... వర్మ యుక్తి

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలని జగన్‌ కంకణం కట్టుకున్నా... అందుకు దీటైన వ్యూహంతో జనసేనాధిపతి విజయం సాధించారు. పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై మొదటి నుంచి సస్పెన్స్‌ కొనసాగింది. చివరకు దత్తాత్రేయ జన్మస్థలమైన పిఠాపురాన్ని ఆయన ఎంచుకున్నారు. అక్కడ తెదేపా అభ్యర్థిత్వం ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ అప్పటికే పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.పూర్తి కథనం

5. గులకరాయి గురితప్పింది!

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెదేపాపై అభాండాలు మోపి... రాజకీయంగా లబ్ధి పొందేందుకు కోడికత్తి దాడి ఘటనను అడ్డం పెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి గులకరాయి ఘటనను అలాగే మలుచుకునేందుకు యత్నించారు. గులకరాయి తగిలిందని తనపై హత్యాయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు. నుదుటిపై బ్యాండేజీతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు.పూర్తి కథనం

6. జగన్‌.. 11.. 11.. దేవుడి స్క్రిప్ట్‌ ఇదీ?

సీఎం జగన్‌కు దేవుడి స్క్రిప్ట్‌ ఏంటో అర్థమైందో.. లేదో అని సామాజిక మాధ్యమాలలో ట్రోల్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. వైకాపా 11 అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో గెలిచారు. 1+6+4 మొత్తం  11 అవుతుంది. ఇదీ దేవుడి స్క్రిప్ట్‌ అని ఎద్దేవా చేస్తున్నారు.పూర్తి కథనం

7. 5 లక్షలు.. 4 లక్షలు.. 3 లక్షలు..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సత్తా చాటింది. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించింది. ఉమ్మడి ఏపీ సహా విభజన తర్వాత సైతం తెలుగు రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ ఎవరికీ రానంతగా 5.59 లక్షల మెజార్టీతో నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించారు. పూర్తి కథనం

8. హ్యాట్రిక్‌ విజయంతో నెహ్రూ, ఇందిర, వాజ్‌పేయీల సరసన మోదీ

హ్యాట్రిక్‌ విజయంతో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానుల వివరాలను పరిశీలిస్తే...పూర్తి కథనం

9. ఓడింది జగన్‌రెడ్డే కాదు.. జవహర్‌రెడ్డి కూడా..!

ఈ ఎన్నికల్లో వైకాపాకు ఎదురైన ఘోర పరాభవం కేవలం జగన్‌దే అనుకుంటే పొరపాటు! ఆయన సహచరుడు.. కాదు కాదు.. ఆయనకు పూర్తిస్థాయి అనుచరుడిగా మారిపోయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిది కూడా! రాష్ట్ర చరిత్రలోనే ఇంతగా వివాదాస్పదమైన, ఆరోపణలకుగురైన, అధికార పార్టీతో అంటకాగిన అధికారి మరొకరు లేరు.పూర్తి కథనం

10. తల్లిని మించిన రాహుల్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సత్తా చాటారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన రాయ్‌బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి, భాజపా నేత దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌పై 3,90,030 ఓట్ల ఆధిక్యంతో ఆయన నెగ్గారు. 2019లో ఇదే స్థానంలో తన తల్లి సోనియాగాంధీ సాధించిన 1,67,178 ఓట్ల మెజారిటీని రాహుల్‌ అధిగమించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని