Karnataka Results: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పది ముఖ్యమైన కథనాలివే..!

Top Ten News articles: కర్ణాటక ఎన్నికల్లో 224 స్థానాల్లో 136 సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్‌ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పది ముఖ్యమైన కథనాలు మీ కోసం..

Updated : 16 May 2023 18:00 IST

1. కన్నడనాట.. ‘హస్త’వాసిని మార్చిన ‘పంచ’తంత్రం

వరుస ఓటములతో అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం అంచు వరకు వెళ్లిన హస్తం పార్టీ.. తిరిగి బలంగా పుంజుకుంది. ఏడాది ఆరంభంలో హిమాచల్‌ప్రదేశ్‌ ఇచ్చిన విజయోత్సాహం.. కాంగ్రెస్‌ నేతల్లో బూస్ట్‌ నింపింది. అదే జోరుతో ఇప్పుడు దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన కర్ణాటకను చేజిక్కించుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కర్ణాటకలో కమలం వాడిపోవడానికి కారణాలెన్నో..!

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో అధికార భాజపా చతికిలపడింది. గతంలో సాధించిన సీట్లలో దాదాపు 40కిపైగా ఈ సారి కోల్పోయింది. కేవలం కొన్ని సామాజిక వర్గాలపై ఆధారపడటం.. అవినీతి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం.. రిజర్వేషన్ల తేనెతుట్టెను ఎన్నికలకు ముందు కదపడం వంటివి కమలం విజయావకాశాలను దెబ్బతీశాయి. ఎన్నికల ప్రచారం చివర్లో భాజపా దిగ్గజ నేతలు మోదీ, షా, యోగి త్రయం ప్రచారం చేసినా..  అవి ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సిద్ధా.. శివ.. ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress)కు ఓటర్లు విస్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. 2004 నుంచి ఆ పార్టీకి స్థాయి మెజార్టీ రావడం రెండోసారి. ఈ సారి ముఖ్యమంత్రి స్థానానికి పార్టీకి చెందిన దిగ్గజ నేతలు పోటీపడుతున్నారు. ఈ రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar)ముందంజలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్ అఖండ విజయంతో.. ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయ్..!

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ గెలుపుతో హస్తం పార్టీ కార్యాలయాల్లో పండగవాతావరణం నెలకొంది. ఈ భారీ మెజార్టీపై పార్టీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. విద్వేష మార్కెట్లు మూతపడ్డాయని, ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘చామరాజనగర్‌’ సెంటిమెంట్‌.. ఆనవాయితీ రిపీట్‌

కర్ణాటకలో గత 38 ఏళ్లుగా ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాకపోవడం ఆనవాయితీగా వస్తోంది. 1983, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు జనతా పార్టీ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్లీ సిట్టింగ్‌ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవలేదు. 2013లో కాంగ్రెస్‌ గెలవగా.. 2018 ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


ఫలితాలకు సంబంధించిన లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


6. ఫలించని బ్రహ్మానందం ప్రచారం.. హీరో నిఖిల్‌కు మరో ఫ్లాప్‌.. గాలి కుటుంబానికి నిరాశ

కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు అభ్యర్థుల తరపున సినీ నటులు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఎన్నికల ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి, మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని తెలుగులో విన్నవించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సోనియాకు మాటిచ్చినట్టే..: ఉద్వేగానికి గురైన డీకే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖరారైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ ఉద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో పార్టీని గెలిపిస్తానని సోనియాగాంధీకి మాట ఇచ్చానని చెప్పారు. ‘కర్ణాటకలో పార్టీని విజయతీరాలకు చేర్చుతానని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేకు మాట ఇచ్చాను. నేను జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ నన్ను కలవడానికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యడియూరప్ప రేసులో ఉంటే ఫలితం మరోలా ఉండేదా?

దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక(Karnataka)లో భాజపా(BJP) పరాజయం పాలైంది. దీంతో దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోనూ లేనట్టయింది. గత మూడు దశాబ్దాల నుంచి కర్ణాటకలో భాజపా ప్రాబల్యం బాగా విస్తరించింది. ఈ విస్తరణ వెనుక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Yediyurappa) కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కర్ణాటక కాంగ్రెస్‌కు అభినందనలు: మోదీ

కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ అభినందించారు. భాజపా కోసం కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ 136 సీట్లు సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ‘కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను ఆ పార్టీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కన్నడిగులు పౌరుషాన్ని నిలబెట్టారు.. కాంగ్రెస్‌కు కంగ్రాట్స్‌!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అపూర్వ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు గానూ హస్తం పార్టీ 136 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. భాజపా (BJP) 64 స్థానాలతో రెండో స్థానానికి పరిమితం కాగా..  జేడీఎస్‌ (JDS) 20, ఇతరులు 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సాధించిన విజయం పట్ల భాజపాయేతర పార్టీల ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని