Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 15 May 2023 17:35 IST

1. బాబోయ్‌ ఎండలు మండిపోతున్నాయ్‌.. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అన్ని చోట్లా పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదు అవుతుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆర్‌-5 జోన్‌పై పిటిషన్లు.. సీజేఐకి రిఫర్‌ చేసిన సుప్రీం ధర్మాసనం

రాజధాని అమరావతి పరిధిలోని ఆర్‌-5 జోన్‌ వ్యవహారంపై రైతులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం సీజేఐకి రిఫర్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ రాజేశ్ బిందాల్‌ బెంచ్‌ నిర్ణయం తీసుకుంది. అమరావతిపై పిటిషన్ల విచారణను మరో బెంచ్‌ చూస్తోందని.. అలాంటప్పుడు తాము విచారించడం సరికాదని అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రానున్న పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి: కేటీఆర్‌

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్‌ తమ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారు కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 20 నిమిషాలకో ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. మిగతా బస్సులను విడతలవారీగా ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకొస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సిద్ధూ - డీకే.. సీఎం కుర్చీ చెరిసగమేనా..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ (Congress) పార్టీకి.. ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం క్లిష్టంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar) మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో.. తుది నిర్ణయాన్ని అధిష్ఠానానికే వదిలేశారు. దీంతో సీఎం ఎంపిక కోసం పార్టీ హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా..? లేదా..? : సీఎస్‌కే సీఈవో ఏమన్నారంటే..

ఎంఎస్ ధోనీ (MS Dhoni) మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs KKR) మ్యాచ్‌ జరిగింది. ఇందులో సీఎస్‌కే ఓటమిపాలైంది. కానీ, అభిమానులు మాత్రం ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా తమ జట్టుకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో మరోసారి ధోనీ రిటైర్‌మెంట్‌పై చర్చకు తెరలేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాట్సాప్‌లో కొత్తగా ‘ఎడిట్‌’ ఆప్షన్‌..!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. పొరపాటున ఏదైనా మెసేజ్‌ అవతలి వారికి పంపిస్తే దాన్ని డిలీట్‌ చేసుకునే ఆప్షన్‌ ప్రస్తుతం ఉంది. ఒకప్పుడైతే అదీ ఉండేది కాదు. తాజాగా మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ‘ఎడిట్‌’ ఆప్షన్‌ను (Edit message) వాట్సాప్‌ తీసుకొస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఖర్గేపై రూ.100కోట్ల పరువునష్టం దావా.. కోర్టు సమన్లు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress party chief Mallikarjun Kharge)కు పంజాబ్‌ కోర్టు సోమవారం సమన్లు జారీచేసింది. బజరంగ్‌ దళ్‌ వివాదంలో ఆయనపై దాఖలైన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో ఈ సమన్లు ఇచ్చింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశమే అందుకు కారణమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. యూకే పర్యటనకు జెలెన్‌స్కీ..!

ఎలాంటి ముందస్తు ప్రకటనలు, హడావుడి లేకుండా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హఠాత్తుగా యూకే పర్యటనకు వెళ్లారు. ఆయన ఈ పర్యటనలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జెలెన్‌స్కీ ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. కీలకమైన చర్చల కోసం మిత్రుడు రిషి సునాక్‌తో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మరింత సైనిక సాయం కోరే అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు: సంజూ శాంసన్

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. జైపుర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను కేవలం 59 పరుగులకే కుప్పకూల్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని