Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 28 Apr 2023 21:01 IST

1. వారం రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు: మంత్రివర్గ ఉప సంఘం

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేసి.. వారం రోజుల్లో పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై మంత్రి వర్గ ఉపసంఘం బీఆర్కే భవన్‌లో సమావేశమై చర్చించింది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విశాఖ ఆర్కే బీచ్‌లో శ్వేత మృతదేహం.. వీడిన మిస్టరీ

విశాఖ ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) కేసులో మిస్టరీ వీడింది. శ్వేత మృతిని ఆత్మహత్యగా భావించినప్పటికీ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. శ్వేత ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గరి నుంచి.. ఆర్కే బీచ్‌లో శవమై కనిపించినప్పటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలను విశాఖ సీపీ త్రివిక్రమ్‌ వర్మ మీడియాకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జూన్‌5కు వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినలేమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేంద్ర తెలిపారు. ఇవాళ వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం వీలు కాదన్నారు. రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున విచారణను జూన్‌ 5కు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 100 ఎపిసోడ్‌ల ‘మన్‌ కీ బాత్‌’.. ప్రధాని మోదీ నోట.. తెలుగు ఘనకీర్తి మాట!

ప్రతినెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలవుతూనే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది. టీవీ ప్రపంచం ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజకీయం గురించి మాట్లాడాలనుంది.. కానీ అది వద్దంటోంది: రజనీకాంత్‌

‘ఇంత పెద్ద సభను చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనుందని, కానీ, అనుభవం వద్దని ఆపుతోంది’ అని ప్రముఖ హీరో రజనీకాంత్‌ (Rajinikanth) అన్నారు. విజయవాడ వేదికగా నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల శంఖారావానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అనురాగ్ ఠాకూర్ మా కాల్స్‌కు బదులివ్వడం లేదు: రెజ్లర్లు

లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)ను వెంటనే జైల్లో పెట్టాలని రెజ్లర్లు(wrestlers) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయనపై కేసు నమోదు చేస్తామని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో.. రెజ్లర్ల నుంచి ఈ స్పందన వచ్చింది. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసేవరకు తమ దీక్ష కొనసాగుతుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఎంఆర్‌ కుమార్‌ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో పూర్తయిన నేపథ్యంలో మొహంతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మొహంతి ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, యాక్టింగ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చీతాల మృతి.. దక్షిణాఫ్రికా స్పందన ఇదే!

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కు (Kuno national Park)లో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతా (Cheetah) మృతి  చెందడంపై ఆ దేశ అటవీ, మత్య్స, పర్యావరణశాఖ (DFFE) స్పందించింది. ఈ తరహా పరిణామాలు ఉంటాయని ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఊహించామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బీబీసీ ఛైర్మన్‌ రాజీనామా.. బోరిస్‌ జాన్సన్‌ రుణ వివాదమే కారణం!

బ్రిటన్‌ (Britain)కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ ‘బీబీసీ (BBC)’ ఛైర్మన్‌ రిచర్డ్‌ షార్ప్‌ (Richard Sharp) తన పదవికి రాజీనామా చేశారు. 2021లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ (Boris Johnson)కు రుణం ఇప్పించిన విషయంలో తన ప్రమేయాన్ని వెల్లడించకుండా.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ స్వతంత్ర దర్యాప్తులో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మళ్లీ టీమ్‌లకు గాయాల బెడద.. కీలక సమయంలో తప్పని కష్టాలు!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో సగం మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆఫ్స్‌ కోసం ఇప్పుడే అసలైన సమరం మొదులకానుంది. ఈ క్రమంలో రూ.కోట్లను వెచ్చించి మరీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు కీలక మ్యాచ్‌లకు దూరమైతే ఆయా ఫ్రాంచైజీలకు తీవ్ర నష్టం. లీగ్‌ ప్రారంభానికి ముందే వైదొలిగితే.. అతడి స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చి మ్యాచ్‌లకు సన్నద్ధం చేసేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని