Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2023 13:10 IST

1. ఉక్రెయిన్‌పై భారీ దాడి.. నోవా కఖోవ్కా డ్యామ్‌ పేల్చివేత..!

ఉక్రెయిన్‌ భయపడినంతా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చివేయడంతో.. నీటి వరద ముంచుకురావడం మొదలైంది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌కు 30 కిమీ దూరంలోని ఈ డ్యామ్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. గత కొన్ని నెలలుగా ఈ డ్యామ్‌ సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ ఈ ఘటనపై స్పందిస్తూ రష్యా దళాలే దీనిని పేల్చివేశాయని ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. సికింద్రాబాద్‌లో స్మార్ట్‌ కాపీయింగ్‌

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్‌ కాపీయింగ్‌ జరిగింది. దీనికి సంబంధించి ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ సెంటర్‌లో చింతపల్లి చైతన్య కృష్ణ అనే విద్యార్థి తాను రాసిన జవాబులను వాట్సాప్‌ ద్వారా మిత్రులకు పంపించాడు. మొత్తం నలుగురు విద్యార్థులకు జవాబులు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. వారంతా కూడా వివిధ సెంటర్లలో పరీక్ష రాస్తున్నవారే కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యాపిల్‌ గాగిల్స్‌ వచ్చేశాయ్‌.. ధరెంతో తెలుసా?

నాణ్యమైన, అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలకు పెట్టింది పేరైన టెక్ దిగ్గజం యాపిల్ (Apple) మరో కొత్త ప్రొడక్ట్‌ను పరిచయం చేసింది. ఎంతో కాలంగా టెక్‌ ప్రియులను ఆతృతకు గురిచేసిన అత్యాధునిక హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. వర్చువల్‌, రియల్‌ ప్రపంచం మధ్య యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనున్న ఈ పరికరాన్ని సోమవారం జరిగిన వార్షిక సమావేశంలో సీఈఓ టిమ్‌ కుక్‌ పరిచయం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో

భారత నౌకాదళం (Indian Navy) అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరబోతోంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడో (Heavy Weight Torpedo)ను నేవీ మంగళవారం పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని (Underwater Target) ఈ టార్పిడో విజయవంతంగా ఛేదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మీరు దిల్లీ వెళ్లి చూడండి.. భారత్‌ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: అమెరికా

భారత్‌ (India)లోని ప్రజాస్వామ్యానికి అమెరికా(USA) అధ్యక్ష భవనం శ్వేతసౌధం నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది. భారత్‌ చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశమని.. ఎవరైనా సరే న్యూదిల్లీ వెళ్లి ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోవచ్చని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహామండలి సమన్వయకర్త జాన్‌ కెర్బీ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన చర్చలోనే ప్రజాస్వామ్య సంస్థల బలం ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. స్టీరింగ్‌ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్టీరింగ్‌ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పింది.  ఈ ఘటనలో డ్రైవర్‌, కండక్టర్‌ సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒడిశా రైలు దుర్ఘటన.. రంగంలోకి సీబీఐ

యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Tragedy)పై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ మొదలుపెట్టింది. మంగళవారం ఉదయం 10 మంది సీబీఐ (CBI) అధికారుల బృందం బాలాసోర్‌లోని ప్రమాదస్థలికి చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి.. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను సీబీఐ పరిశీలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్‌పై బ్యాన్‌ కొనసాగింపు

మణిపుర్‌(Manipur)లో మరోసారి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిన్న అర్ధరాత్రి భద్రతాదళాలు, వేర్పాటు వాద గ్రూపు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌(BSF)కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. అస్సాం రైఫిల్స్‌(Assam Rifles)కు చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక భద్రతను పర్యవేక్షిస్తున్న సైన్యానికి చెందిన స్పియర్‌ కోర్‌ కమాండ్‌ ధ్రువీకరించింది. గాయపడ్డ జవాన్లను మెరుగైన వైద్యం కోసం తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్ భూషణ్‌ ఇంటికి దిల్లీ పోలీసులు

 లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న(sexual harassment) భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్‌(Brij Bhushan Sharan Singh) ఇంటికి మంగళవారం దిల్లీ పోలీసులు చేరుకున్నారు. విచారణ నిమిత్తం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా(Uttar Pradeshs Gonda)లోని ఆయన ఇంటివద్దకు వెళ్లారని సమాచారం. దానిలో భాగంగా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించి 12 మంది వాంగ్మూలం రికార్డు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కాకినాడ సెజ్‌లో ఎంఐపీ ఏర్పాటుపై ప్రజాగ్రహం

కాకినాడ సెజ్‌లో మల్టీ ప్రాడెక్ట్స్‌ ఇండస్ట్రియల్‌ పార్కు(ఎంఐపీ) ఏర్పాటును కె.పెరుమాళ్లపురం, పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారులు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్‌ పార్కు వివరాలను గ్రామస్థులకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు దాన్ని వ్యతిరేకిస్తూ ఒక్కసారిగా నిరసనకు దిగారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు