Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jul 2023 13:14 IST

1. అణుదాడికి పాల్పడితే.. కిమ్ పాలన అంతమైనట్లే..!

ఉత్తర కొరియా(North Korea) దేశానికి.. దక్షిణ కొరియా(South Korea) తీవ్ర హెచ్చరికలు పంపింది. ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే కిమ్ జోంగ్ ఉన్‌(Kim Jong Un) పాలన అంతమైనట్లేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు దక్షిణ కొరియా వార్తా సంస్థ కథనం పేర్కొంది. అణు క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న అమెరికా(USA) జలాంతర్గామిని ఇటీవల దక్షిణ కొరియా(South Korea) సమీపంలో నిలిపి ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏకైక బ్యాటర్‌గా రికార్డు.. సచిన్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ

వెస్టిండీస్‌తో జరుగుతున్న (WI vs IND) రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (121) సూపర్ సెంచరీ సాధించాడు. టీమ్ఇండియా తరఫున విరాట్ కోహ్లీకిది 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ కాగా.. విండీస్ - భారత్‌ జట్ల మధ్య వందో టెస్టు కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ టెస్టుల్లో 29వ సెంచరీ నమోదు చేశాడు. అన్ని ఫార్మాట్లు కలిపి శతకాల సంఖ్య 76కి చేరింది. సచిన్‌ను విరాట్ ఓ రికార్డు విషయంలో అధిగమించాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మణిపుర్ ఘటన.. అదేరోజు 40 కి.మీ దూరంలో మరో ఘోరం..!

మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన (Manipur Incident) దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీనిపై ఆగ్రహజ్వాలలు చెలరేగుతోన్న సమయంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో అదే రోజున మరో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ముంబయిని ముంచెత్తిన వానలు.. రాయ్‌గఢ్‌లో ఇంకా దొరకని 86 మంది ఆచూకీ

మహారాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి నగరం, శివారులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వర్షాల కారణంగా ముంబయిలో 100కి పైగా లోకల్‌ రైళ్లు రద్దయ్యాయి. అటు ముంబయికి వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. స్కూల్‌కు సెలవు పెట్టకుండా 50 దేశాలను చుట్టేసిన పదేళ్ల చిన్నారి.. అదెలాగో తెలుసా..!

ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. అయితే.. పిల్లల స్కూళ్లు, ఉద్యోగాలు, అదనపు ఖర్చుల వంటి కారణాలతో చాలా మంది ఆగిపోతుంటారు. కానీ.. ఓ పదేళ్ల చిన్నారి ఇప్పటివరకు 50 దేశాలను సందర్శించింది. అదీ ఒక్క రోజు స్కూల్‌ మానేయకుండానే. ఆశ్చర్యంగా ఉంది కదా..! అసలు ఆ చిన్నారికి ఇన్ని దేశాలు తిరగడం ఎలా సాధ్యమైందో తెలుసా?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసం.. 9 మంది అరెస్టు

పెట్టుబడుల పేరుతో మోసాలు చేస్తున్న 9 మంది సైబర్‌ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి, లఖ్‌నవూ, గుజరాత్, హైదరాబాద్‌కు చెందిన ఈ నిందితులకు.. దుబాయ్, చైనాకు చెందిన నేరస్థులతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.712 కోట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాముకాటు.. ఆకుపసరు నమ్ముకుని తండ్రీకుమారుడి మృతి!

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని షేర్‌ శంకర్‌ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పాము కాటుకు గురై తండ్రి రవి (40), కుమారుడు వినోద్‌ (12) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు వినోద్‌ని మొదట పాము కరిచింది. ఇది గమనించిన తండ్రి రవి పామును చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రవిని సైతం పాము కాటు వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కాంగ్రెస్‌ ‘ఫోన్‌ బ్యాంకింగ్‌ స్కామ్‌’.. ఆ రంగం నడ్డి విరిచింది: మోదీ

కాంగ్రెస్‌ (Congress) నేతృత్వంలోని గత యూపీఏ పాలన (UPA Govt)పై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) మరోసారి విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్‌ రంగాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆ కుంభకోణాల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public sector banks) భారీ నష్టాలను చవిచూశాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకులు మళ్లీ కోలుకున్నాయని, ఇప్పుడు ఈ రంగం మరింత బలోపేతమైందని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టైరు పేలి రాంగ్‌రూట్‌లోకి కారు.. ఆపై లారీ ఢీ కొనడంతో ఇద్దరి మృతి

మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు దుర్మరణం చెందారు. నార్సింగి మండలం నర్సంపల్లికి చెందిన తౌర్య నాయక్ (50) తన చిన్న కుమారుడు అంకిత్‌ (10)తో కలిసి కారులో చేగుంటకు బయలు దేరారు. వల్లూరు అటవి ప్రాంతంలో జాతీయ రహదారిపై టైరు పేలడంతో.. కారు డివైడర్‌ను దాటి రాంగ్‌రూట్‌లోకి దూసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జులై 28 నుంచి ola s1 air బుకింగ్స్‌.. వీళ్లకు రూ.10వేలు తక్కువకే..

విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) తన s1 air ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. MoveOS-3 ఫీచర్‌తో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌ బుకింగ్స్‌ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని