Kamareddy: పాముకాటు.. ఆకుపసరు నమ్ముకుని తండ్రీకుమారుడి మృతి!

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని షేర్‌ శంకర్‌ తండాలో పాముకాటుకు గురై తండ్రీకుమారుడు మృతి చెందారు.

Updated : 22 Jul 2023 11:30 IST

కామారెడ్డి నేర విభాగం: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని షేర్‌ శంకర్‌ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పాము కాటుకు గురై తండ్రి రవి (40), కుమారుడు వినోద్‌ (12) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 

దోస్త్‌ ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పు

కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు వినోద్‌ని మొదట పాము కరిచింది. ఇది గమనించిన తండ్రి రవి పామును చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రవిని సైతం పాము కాటు వేసింది. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా స్థానికంగా ఏదో ఆకు పసరు వేసుకుని.. తమకు ఏమీ కాదనే నమ్మకంతో ఉన్నారు. ఇంతలోనే వినోద్‌ ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. రవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి కూడా ప్రాణాలు కోల్పోయాడు. పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే ఇద్దరి ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు వాపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని