Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Jul 2023 13:25 IST

1. ఆహారం కోసం.. భవనంపై నుంచి దూకిన బాలిక..!

ఆహారం కోసం ఎనిమిదేళ్ల బాలిక మొదటి అంతస్తు నుంచి దూకింది. తల్లిదండ్రులు ఆమెకు కొన్ని రోజులుగా ఆహారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. అమెరికా (America)లోని వెస్ట్‌ వర్జీనియా (West Virginia)లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ర్యాన్‌ కీత్‌ హర్డ్‌మన్‌, ఎలియో ఎమ్‌ దంపతులు ఆర్నాల్డ్స్‌బర్గ్లో నివాసముంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తమ ఎనిమిదేళ్ల  కుమార్తెకు చాలా రోజులుగా ఆహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘పాకిస్థానీలు ఆ చిప్పను పక్కన పడేయాలి’.. దేశ ఆర్మీచీఫ్‌ వ్యాఖ్య

పాకిస్థాన్‌ విదేశీ రుణాలపై ఆధారపడటాన్ని మానేయాలని ఆ దేశ ఆర్మీచీఫ్‌ జనరల్‌ ఆసిం మునీర్‌ హితబోధ చేశారు. సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఆయన ఖానేవాల్‌ మోడల్‌ అగ్రికల్చర్‌ ఫామ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావంతులు, గర్వించదగినవారు. పాక్‌ వాసులు కచ్చితంగా చిప్పను (బెగ్గర్స్‌ బౌల్‌) విసిరేయాలి’’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో గంజాయి మినహా అన్నీ సంక్షోభంలోనే: చంద్రబాబు

సీఎం జగన్‌ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను చంపేసి రివర్స్‌గేర్‌లో నడిపిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షోభానికి కారణమైన జగన్‌కు పరిపాలించే అర్హత ఎక్కడిదని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అప్పటి ప్రత్యర్థి జలగం వెంకట్రావు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. నేడు తీర్పు వెలువరించింది. ప్రస్తుత ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కూటమి పేరులో ‘ఇండియా’ ఉంటే సరిపోదు: విపక్షాలపై మోదీ తీవ్ర విమర్శలు

 ప్రధాని నరేంద్రమోదీ(Modi) విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఏ దిశాదశ లేకుండా వారు ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు.. రెండు రోజుల్లో 700 మంది

తెగల మధ్య వైరం కారణంగా మణిపుర్‌ (Manipur)లో రెండు నెలలకుపైగా ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ క్రమంలోనే మరో కొత్త అంశం మణిపుర్‌ (Manipur) ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. సుమారు 700 మందికి పైగా మయన్మార్‌ (Myanmar) వాసులు మణిపుర్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. IRCTCలో సాంకేతిక సమస్య.. టికెట్‌ సేవలకు అంతరాయం

ఐఆర్‌సీటీసీ (IRCTC)లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో టికెట్‌ బుకింగ్‌ సేవల (Ticket Booking services)కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి తమ వెబ్‌సైట్‌, యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ సేవలు అందుబాటులో లేవని పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు తమ సీఆర్‌ఐఎస్‌ (CRIS) సాంకేతిక బృందం ప్రయత్నిస్తోందని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Bribe: లంచంతో అడ్డంగా దొరికిపోయి.. నోట్లు మింగేసి..!

లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. ఊహించని రీతిలో ఎదురుగా అధికారులు కనిపించేసరికి.. ఆ లంచం డబ్బులు ఏం చేయాలో తెలియక.. వాటిని మింగేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో జరిగింది. మీడియా కథనాల ప్రకారం.. (Official Swallows money). గజేంద్ర సింగ్‌.. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని కట్నీ నగరంలో రెవెన్యూ విబాగంలో పనిచేస్తున్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘అభిమానులను కరీనా పట్టించుకోలేదు’: నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్య

ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌ (Kareena Kapoor) గురించి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) దంపతులు మాట్లాడిన ఆసక్తికర సంభాషణ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులను కరీనా అంతగా పట్టించుకోరని నారాయణ మూర్తి వ్యాఖ్యానించగా.. ఆ మాటలను ఆయన సతీమణి సుధామూర్తి (Sudha Murthy) వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు. ఇంతకీ వీరిద్దరూ కరీనా గురించి ఏం మాట్లాడారంటే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రెండు దేశాల మధ్య నమ్మకం పోయింది..: అజిత్‌ డోభాల్‌

2020లో వాస్తవాధీన రేఖ వెంట చోటు చేసుకొన్న పరిణామాల కారణంగా భారత్‌-చైనా మధ్య వ్యూహాత్మక, ప్రజా, రాజకీయ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య విశ్వాసం కనుమరుగైందన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతన్న బ్రిక్స్‌ సమావేశంలో ఆయన చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్‌ యీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని