Bribe: లంచంతో అడ్డంగా దొరికిపోయి.. నోట్లు మింగేసి..!

లంచం డబ్బులతో దొరికిపోయిన ఓ ఉద్యోగి తన ప్రవర్తనతో లోకాయుక్త అధికారులను షాక్‌కు గురిచేశారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

Updated : 25 Jul 2023 10:23 IST

భోపాల్‌: లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. ఊహించని రీతిలో ఎదురుగా అధికారులు కనిపించేసరికి.. ఆ లంచం డబ్బులు ఏం చేయాలో తెలియక.. వాటిని మింగేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో జరిగింది. మీడియా కథనాల ప్రకారం.. (Official Swallows money)

గజేంద్ర సింగ్‌.. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని కట్నీ నగరంలో రెవెన్యూ విబాగంలో పనిచేస్తున్నాడు. ఓ పని నిమిత్తం అతడి వద్దకు వచ్చిన వ్యక్తిని రూ.5 వేల లంచం అడిగాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. దానిపై స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్ లంచం తీసుకునేప్పుడు పట్టుకునేలా వల పన్నారు. దానిలో భాగంగా సింగ్‌కు చెందిన ప్రైవేటు కార్యాలయంలో సదరు వ్యక్తి నుంచి రూ.5వేలు తీసుకుంటుండగా.. అక్కడ లోకాయుక్త అధికారులు ప్రత్యక్షమయ్యారు. 

అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు

ఈ ఊహించని పరిణామంతో రెవెన్యూ అధికారి అవాక్కయ్యాడు. ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యాడు. వాటితో సహా దొరికిపోకూడదనే ఉద్దేశంతో ఒక్కసారిగా వాటిని మింగేశాడు. అతడి ప్రవర్తన చూసి నివ్వెరపోవడం అధికారుల వంతైంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన సోమవారం జరగ్గా.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు