Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Aug 2023 13:04 IST

1. మహిళను చంపి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు!

నగరంలోని శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ (30)ను దుండగులు దారుణంగా హతమార్చారు. శంషాబాద్‌ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళను చంపేసిన తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మరింత తగ్గిన టమాటా ధర

మదనపల్లె మార్కెట్‌లో గత ఐదు రోజులగా టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏ గ్రేడు టమాటాలు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు, బీ గ్రేడు రూ.21 నుంచి రూ.28 వరకు పలికింది. సగటున కిలో టమాటా రూ.26 నుంచి రూ.37 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్‌యార్డు కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపా నేత దాష్టీకం.. తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణంపల్లిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశంలో వివాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వైకాపా నేత దాష్టీకానికి పాల్పడ్డారు. చౌడు రెడ్డి అనే వైకాపా నేత.. ఇతర ప్రాంతాల నుంచి రెండు కార్లలో కొత్త వ్యక్తులను గ్రామానికి పిలిపించి తెదేపా కార్యకర్తల ఇళ్లపై దాడి చేయించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇప్పుడు బండి సంజయ్‌ని మేమేం చేయాలి?: కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌ను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ లోక్‌సభలో అసభ్యకరంగా దూషించారని కేటీఆర్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని ఇంటి పేరు అవమానించారని కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కేసీఆర్‌ను దూషించిన బండి సంజయ్‌ను మేమేం చేయాలి?ఇప్పుడు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఏం చేస్తారు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అధైర్య పడొద్దు.. అక్రమ కేసుల బాధిత కుటుంబాలకు చంద్రబాబు ఫోన్‌

పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధిత కుటుంబాలతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. అంగల్లు, పుంగనూరు ఘటనల్లో చంద్రబాబుతో సహా వందల మంది తెదేపా నేతలు, కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అరెస్టు అయిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పవన్‌కు మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. వారాహి యాత్రలో భాగంగా విశాఖలో పర్యటించిన పవన్‌.. స్టీల్‌ప్లాంట్‌ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా.. తెలంగాణ భాజపా పావులు

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలోకి రావాలంటే ఈ నియోజకవర్గాల్లో సింహభాగం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో రిజర్వ్ నియోజకవర్గాల నేతలతో.. రాష్ట్ర ఇంఛార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మణిపుర్ కల్లోలం.. మోదీకి మద్దతుగా అమెరికన్‌ సింగర్ ట్వీట్‌

మణిపుర్ అంశం( Manipur violence)పై ప్రధాని నరేంద్రమోదీ(Modi)కి అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ మేరీ మిల్బెన్‌(Mary Milliben) నుంచి మద్దతు లభించింది. ఆయన ఈశాన్యరాష్ట్ర ప్రజల కోసం నిత్యం పోరాడుతుంటారని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా చివరగా గురువారం ప్రధాని మాట్లాడారు. అది ముగిసిన కొద్దిసేపటికే మిల్బెన్‌ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వాకింగ్‌ చేస్తుండగా.. భాజపా నేత దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లో ఓ భాజపా (BJP) నేతను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మొరాదాబాద్‌ ప్రాంతంలో తన నివాసం ముందు భాజపా నేత అనూజ్‌ చౌదరి (Anuj Chaudhary) తన సోదరుడితో కలిసి వాకింగ్‌ చేస్తుండగా.. ముఖానికి మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అయన్ను అనుసరించి వెనుక నుంచి కాల్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చైనా ఓ ఆర్థిక టైమ్‌బాంబ్‌..: జోబైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు

జనాభా, ఆర్థిక సమస్యలు చైనా(China)ను పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్‌ బాంబులా మార్చేశాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ పరిస్థితి.. మిగిలిన ప్రపంచాన్ని భయపెడుతోందన్నారు. గురువారం యూటాలోని పార్క్‌సిటీలో విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని