Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 19 Aug 2023 13:24 IST

1. ‘అప్పుడే వినుంటే.. ఆ చిన్నారులు బతికేవారేమో’: రాకాసి నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు

వైద్య వృత్తికి, మానవత్వానికి మచ్చ తెచ్చేలా పసికందుల ఉసురు తీసిన యూకే (UK) నర్సు ఉదంతం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు.. ఈ ఘటన గురించి కీలక విషయాలను వెల్లడించారు. నర్సు గురించి తాను ముందే హెచ్చరించానని, అప్పుడే గుర్తించి ఉంటే కొంతమంది చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగేవాళ్లమని విచారం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చదువుకున్న నేతకు ఓటేయమనడం తప్పా..? ‘అన్‌అకాడమీ’పై తీవ్ర విమర్శలు

చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఉపాధ్యాయుడిపై ఇటీవల ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ(Unacademy) వేటు వేసింది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదంటూ ఆయన్ను తొలగించడానికి గల కారణాన్ని వివరించింది. ఇప్పుడు దీనిపై శివసేన(UBT) నేత ప్రియాంకా చతుర్వేది(Priyanka Chaturvedi) విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. KTR: ప్రతిపక్షాలకు ఈసారి సినిమా చూపిస్తాం: కేటీఆర్‌

ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. దక్షిణ భారత దేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ (వీఎస్టీ-ఇందిరా పార్క్‌)ను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. అక్రమాలకు తెరతీసిన వైకాపా!

ఏపీలో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది. ఈక్రమంలో పలుచోట్ల వైకాపా అక్రమాలకు తెరలేపింది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రికత్త నెలకొంది. వైకాపా కార్యకర్తలు.. తెదేపా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి మరీ తమపై దాడులు చేయిస్తున్నారని తెలుగు దేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల ఆందోళన

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (Telangana Express)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర (Maharashtra)లో ప్రయాణిస్తున్న ఈ రైల్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పుర్‌ (Nagpur) సమీపంలో నిలిపివేయడంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరిగెట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శౌచాలయంలో బంధించి మూగ మహిళపై అత్యాచారం

నగరంలోని హుమాయున్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. చెవిటి, మూగ మహిళపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి ఎదురుగా ఉండే సాయి అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను శౌచాలయంలో బంధించి అత్యాచారం చేశాడు. మహిళ భర్త కూడా దివ్యాంగుడే. తన తల్లిని తీసుకుని అతను బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడిన సాయి ఈ దారుణానికి పాల్పడ్డాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అధికార పార్టీకి ఒక రూల్‌, ప్రతిపక్షానికి ఒక రూలా?: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్‌

ఓటమి భయంతో పంచాయతీ ఉప ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో తెదేపా కార్యకర్తలపై వైకాపా మూకల దాడి దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అండ చూసుకునే వైకాపా కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. wildfire: వాషింగ్టన్‌ వైపు దూసుకొస్తున్న కార్చిచ్చు ..!

ఉత్తర అమెరికా దేశాలను కార్చిచ్చు(wildfire) వణికిస్తోంది. బలమైన గాలుల కారణంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హవాయి ద్వీపంలో బీభత్సం సృష్టించిన ఈ కార్చిచ్చు.. ఇప్పుడు అగ్రదేశం అమెరికా(USA) రాజధాని వాషింగ్టన్‌(Washington) వైపు దూసుకొస్తోంది. దీంతో వెంటనే ఖాళీ చేయాలని పలు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Viral video: పెళ్లి వేడుకలో ఫొటోగ్రాఫర్‌ స్టెప్పులు అదుర్స్‌..!

 వివాహ వేడుకలో కెమెరామెన్‌ (Cameraman) సాధారణంగా ఫొటోలు తీస్తుంటాడు. ప్రతి మూమెంట్‌ను క్యాప్చర్‌ చేస్తుంటాడు. కానీ, ఓ ఫొటోగ్రాఫర్‌ మాత్రం బంధువులతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. దీంట్లో విచిత్రం ఏముందనుకుంటున్నారా.. ఒక వైపు తన పని చేసుకుంటూనే.. మరోవైపు అతిథులతో కలిసి పంజాబీ పాటకు ఉత్సాహంగా చిందులు వేస్తూ వీడియో తీశాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Elon Musk: ‘ఎక్స్‌’లో మరో మార్పు.. ‘బ్లాక్‌’ ఫీచర్‌కు మస్క్‌ గుడ్‌బై..!

‘ఎక్స్‌’ (ఒకప్పటి ట్విటర్‌) అధినేత ఎలాన్‌మస్క్‌ (Elon Musk) తన యూజర్లకు మరో షాక్‌ ఇచ్చారు. ‘ఎక్స్‌’ ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్‌ చేసే ఫీచర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఆ ఆప్షన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. భద్రతా పరమైన ఫీచర్లలో ముఖ్యమైన బ్లాక్‌ ఫీచర్‌ను తొలగించటంతో యూజర్లు మస్క్‌పై గుర్రుమంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు