Fire in Train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల ఆందోళన

Fire in Train: ఒకే రోజు రెండు రైళ్లలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పుర్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా.. కర్ణాటకలో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. 

Updated : 19 Aug 2023 13:37 IST

మహారాష్ట్ర: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (Telangana Express)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర (Maharashtra)లో ప్రయాణిస్తున్న ఈ రైల్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పుర్‌ (Nagpur) సమీపంలో నిలిపివేయడంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరిగెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

వరదలు, కొండచరియల ప్రమాదాల్లో.. ఈ వర్షాకాలం 2,038 మంది దుర్మరణం

ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ..

అటు కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లోనూ ఓ రైలుకు ప్రమాదం తప్పింది. కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ (Udyan Express)లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. అయితే ప్రయాణికులు రైలు నుంచి దిగిన రెండు గంటల తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని