KTR: ప్రతిపక్షాలకు ఈసారి సినిమా చూపిస్తాం: కేటీఆర్‌

ఇందిరాపార్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దక్షిణ భారత దేశంలోనే అతిపొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ను మంత్రి ప్రారంభించారు.

Updated : 19 Aug 2023 17:16 IST

హైదరాబాద్: ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. దక్షిణ భారత దేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ (వీఎస్టీ-ఇందిరా పార్క్‌)ను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి పేరును ఈ స్టీల్‌ బ్రిడ్జ్‌కు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు చెప్పారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని తెలిపారు.

మరోవైపు, రాష్ట్రంలో కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపక్షాలకు 2023లోనే సినిమా చూపిస్తామన్నారు.

Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం

రూ.450 కోట్ల వ్యయంతో

మొత్తం 2.63 కి.మీల పొడవైన వీఎస్టీ-ఇందిరా పార్క్‌ వంతెనను రూ.450 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ నిర్మించింది. రాష్ట్రంలోనే తొలి సారిగా మెట్రో బ్రిడ్జిపై నుంచి స్టీల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ స్టీల్ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) వలన రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందిరా పార్క్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని