Viral video: పెళ్లి వేడుకలో ఫొటోగ్రాఫర్‌ స్టెప్పులు అదుర్స్‌..!

వివాహ వేడుకలో ఒక కెమెరామెన్‌ చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 19 Aug 2023 10:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాహ వేడుకలో కెమెరామెన్‌ (Cameraman) సాధారణంగా ఫొటోలు తీస్తుంటాడు. ప్రతి మూమెంట్‌ను క్యాప్చర్‌ చేస్తుంటాడు. కానీ, ఓ ఫొటోగ్రాఫర్‌ మాత్రం బంధువులతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. దీంట్లో విచిత్రం ఏముందనుకుంటున్నారా..

ఒక వైపు తన పని చేసుకుంటూనే.. మరోవైపు అతిథులతో కలిసి పంజాబీ పాటకు ఉత్సాహంగా చిందులు వేస్తూ వీడియో తీశాడు. తన ప్రదర్శనతో వేడుకలో మరింత నవ్వులు పూయించాడు. కెమెరాను వదలకుండా ఫ్లోర్‌పై అద్భుతంగా డ్యాన్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. ఇలాంటి కెమెరామెన్‌ ప్రతి వేడుకలో ఉంటే నవ్వులే నవ్వులు అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని