Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Dec 2023 13:08 IST

1. తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణ నూతన స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన్ను స్పీకర్‌గా ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రగతిభవన్‌ ముందు బారికేడ్లు, గ్రిల్స్‌ తొలగింపు

నగరంలోని ప్రగతిభవన్‌ ముందున్న బారికేడ్లను అధికారులు తొలగిస్తున్నారు. గ్యాస్‌ కట్టర్ల సాయంతో కార్మికులు బారికేడ్లను తీసివేస్తున్నారు. వీటితో పాటు అక్కడి రోడ్డు పక్కనే ఉన్న షెడ్‌, గ్రిల్స్‌ను తొలగిస్తున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు

బాపట్ల జిల్లాలోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. ఈ ఘటనను తెలుగుదేశం (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఖండించారు. అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ (CM Jagan) ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్‌.. విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం

తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలంగాణలో లభ్యమైంది. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఈ ముగ్గురి ఆచూకీ లభించింది. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు ఠాణాకు తరలించి.. ఏపీ పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం సాయంత్రం తిరుమలలో అదృశ్యమైన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రధాని మోదీకి ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’.. ప్రత్యేక సన్మానం

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఘన స్వాగతం లభించింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ (BJP) గెలుపు నేపథ్యంలో గురువారం ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. సమావేశ మందిరంలోకి మోదీ ప్రవేశిస్తుండగా సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనుల మధ్య ఆయనకు స్వాగతం పలికారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మిగ్‌జాం తుపాను.. అభిమానులంతా సాయం చేయాలని పిలుపునిచ్చిన విజయ్‌

మిగ్‌జాం తుపాను దెబ్బకు చెన్నై మహా నగరం మొత్తం అతలాకుతలమైంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ తుపాను ప్రభావాన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు బాధితులకు సాయం చేసేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) తాజాగా దీనిపై పోస్ట్‌ పెట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సహచరులతో గొడవపడతాడు.. సీనియర్లకు గౌరవం ఇవ్వడు: గంభీర్‌పై శ్రీశాంత్

తాజాగా లెజెండ్‌ లీగ్‌ క్రికెట్‌ (LLC)లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన భారత మాజీ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్‌, శ్రీశాంత్ మధ్య చిన్నపాటి కవ్వింపు ఘటన చోటు చేసుకొంది. ఈ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్‌ అద్భుతమైన షాట్లు కొట్టాడు. ఈ క్రమంలో గంభీర్‌ వైపు శ్రీశాంత్‌ తీక్షణంగా చూశాడు. అయితే, గంభీర్‌ కూడా ఏమాత్రం వెనక్కితగ్గకుండా ఏంటన్నట్లు సైగ చేశాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురి మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. గుర్తు తెలియని వ్యక్తి ఓ విశ్వవిద్యాలయంలో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన లాస్‌ వేగాస్‌ (Las Vegas)లో బుధవారం చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నెవాడా విశ్వవిద్యాలయం (Nevada university)లో మధ్యాహ్నం ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సందీప్‌ వంగాను అలా అనుకోవడం అమాయకత్వం..: హరీశ్‌ శంకర్‌

సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌-రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యానిమల్‌’(Animal). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం.. విడుదల అనంతరం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పరిశ్రమలోని ప్రముఖులంతా దీన్ని ప్రశంసిస్తూ రివ్యూలను చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని