Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 23 Apr 2024 13:03 IST

1.ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారు.. : లోకేశ్‌

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటినీ దారిలో పెడతామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని కొండపనేని టవర్స్‌ వాసులతో ఆయన సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గుడివాడలో తెదేపా అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీకి పోలీసుల అడ్డంకులు

కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా (TDP) అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్‌ ర్యాలీకి పోలీసులు అడ్డంకులు కల్పించారు. ఏలూరు రోడ్డులో బారికేడ్లు పెట్టిన పోలీసులు.. బొమ్మరిల్లు థియేటర్‌ వద్ద ర్యాలీని అడ్డుకున్నారు. లీలామహల్‌ సెంటర్‌ మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్‌

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi excise scam case)లో అరెస్టయిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. సోమవారం రాత్రి ఆయన రక్తంలో చక్కెర స్థాయులు 320కి చేరడంతో వైద్యులు ఇన్సులిన్ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

4. గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 

మలేసియా (Malaysia)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు  (Helicopters) గగనతలంలో ఢీకొనడంతో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎంపీగా కరీంనగర్‌కు బండి సంజయ్‌ ఏం చేశారు?: మంత్రి పొన్నం

ముస్లింలను ఉద్దేశించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అన్నారు. ప్రధానిగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ రావేనని.. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్‌ అవసరం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

6. దుబాయ్‌ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా.. 

ఇటీవల ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)ను వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుతో దుబాయ్‌లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం.. కొద్దిగంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు. ఈ కుండపోత వానల ప్రభావాన్ని చూపించే చిత్రాలను నాసాకు చెందిన ల్యాండ్‌శాట్ 9 తీసింది. ఆ దృశ్యాల్లో ఎప్పుడూ పొడిగా కనిపించే ఏడారిలో ముదురు నీలం రంగులో భారీ నీటి కుంటలు దర్శనమిచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

7. ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ కావాలా..? ఉచితంగా పొందండిలా..

బ్యాంకుల్లో పెద్ద మొత్తం డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా, ఐటీ రిటర్నులు ఫైల్ చేయాలన్నా, ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా.. ఇలా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు సజావుగా నిర్వహించాలన్నా పాన్‌కార్డ్‌ (Pan Card) ఉండాల్సిందే. ఇప్పటివరకు పాన్‌కార్డు లేనివారు.. కొత్తగా పాన్‌ పొందాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఒకవేళ అత్యవసర సమయంలో తక్షణమే పాన్‌ నంబర్‌ కావాలంటే..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

8. దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య

జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా ఐపీఎల్‌ 17 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ముంబయి ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలే సాధించింది. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

9. మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన

పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఓడేడు నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

10. కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్‌ జయంతి

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని