icon icon icon
icon icon icon

Nara Lokesh: ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారు.. : లోకేశ్‌

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 23 Apr 2024 15:00 IST

మంగళగిరి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటినీ దారిలో పెడతామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని కొండపనేని టవర్స్‌ వాసులతో ఆయన సమావేశమయ్యారు.  చేనేత అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని.. మంగళగిరిలో వెయ్యి ఉన్న మగ్గాలను 5 వేలకు పెంచుతామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో చేనేత కార్మికులకు, స్వర్ణకారులకు నూతన డిజైన్లపై శిక్షణ కల్పిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img