Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 26 Mar 2024 13:18 IST

1. అదానీ చేతికి మరో పోర్టు.. 

గోపాల్‌పూర్‌ పోర్టును అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌కు విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ మంగళవారం ప్రకటించింది. తమ ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్ల విలువ వద్ద దీన్ని అమ్మినట్లు చెప్పింది. ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్‌పీ గ్రూప్‌ 2017లో కొనుగోలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కడిగిన ముత్యంలా బయటకు వస్తా: కవిత

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈ సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఇది మనీలాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు అని పేర్కొన్నారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రహస్యంగా రూ.వందలకోట్ల ఆస్తి.. కుమారుడికి తెలియకుండా దాచిన తండ్రి..!

వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా ఉంచాడో తండ్రి. 20 ఏళ్లు వచ్చిన తర్వాతే తమ సంపద గురించి అతడికి వెల్లడించాడట. ఏటా రూ. 690 కోట్ల విలువైన వ్యాపారం చేసే మాలా ప్రిన్స్‌ బ్రాండ్‌ వ్యవస్థాపకుడి కుటుంబ కథ ఇది..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. యశ్‌ దయాల్‌పై ‘ట్రాష్‌’ కామెంట్లు.. మాజీ క్రికెటర్‌పై విమర్శలు

 ఐపీఎల్‌ తాజా సీజన్‌లో బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. అద్భుత ప్రదర్శనతో తొలుత బౌలర్లు పంజాబ్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత కోహ్లి చెలరేగి జట్టును గెలిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత మాజీ క్రికెటర్‌ మురళీ కార్తిక్‌ (Murali Kartik) చేసిన వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కంగనపై పోస్టు వివాదం.. కాంగ్రెస్‌ నేతపై జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు

 లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut)కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్టు దుమారం రేపుతోంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యకు పాల్పడిన సుప్రియా శ్రీనతే (Supriya Shrinate)పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. తన ఫిర్యాదులో హెచ్‌.ఎస్‌.అహిర్‌ పేరును ప్రస్తావించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన ఏ మాత్రం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇవీ కుంగుబాటు లక్షణాలే..

ఎప్పుడో అప్పుడు ఆందోళన, దిగులు పడటం మామూలే. కానీ ఇలాంటి భావనలు వారాల కొద్దీ విడవకుండా వేధిస్తుంటే కుంగుబాటు (డిప్రెషన్‌) కావొచ్చని అనుమానించాలి. ఇది మానసిక సమస్యే అయినా శరీరం మీదా ప్రభావం చూపుతుంది. గుండె, కిడ్నీలు, నాడులు, రోగనిరోధక వ్యవస్థ.. ఇలా అన్నింటినీ విపరీతంగా ప్రభావితం చేయొచ్చు. ఇవి వివిధ లక్షణాల రూపంలోనూ కనిపిస్తుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారతీ హెగ్జాకామ్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.542-570

భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ ‘భారతీ హెగ్జాకామ్‌’ ఐపీఓ (Bharti Hexacom IPO) ధరల శ్రేణిని రూ.542-570గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.4,275 కోట్లు సమీకరించనుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ఏప్రిల్‌ 3న ప్రారంభమై 5న ముగియనున్న విషయం తెలిసిందే. యాంకర్‌ మదుపర్లు ఏప్రిల్‌ 2న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాలో అదే హైలైట్‌: రాజమౌళి

ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. రామ్‌చరణ్‌ (Ram Charan) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఇది రూపొందనుంది. దీనిపై గతంలో రాజమౌళి (SS Rajamouli) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. స్తంభనకు షాక్‌

అంగ స్తంభన లోపానికి షాక్‌ చికిత్స! నిజంగా ఇది షాక్‌ కొట్టే విషయమే. జననాంగాలు ఎంత సున్నితమో తెలిసిందే. అలాంటి చోట్ల షాక్‌ చికిత్స అంటే ఎవరికైనా భయం పుట్టుకొస్తుంది. కానీ అంగ స్తంభన లోపానికి తక్కువ తీవ్రతతో కూడిన షాక్‌వేవ్‌ చికిత్స (ఎల్‌ఐఎస్‌డబ్ల్యూటీ) కొత్త విధానంగా ఉపయోగపడుతుండటం విచిత్రం. కిడ్నీల్లో రాళ్లను పగలగొట్టటానికి వాడే ఇది స్తంభన లోపానికి ఎలా పనికొస్తుంది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బెజవాడలో బతకనివ్వరా..?

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2020-21లో ఆస్తి పన్ను రూ.130 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. 2023-24కు వచ్చేసరికి ఇది రూ.197.59 కోట్లకు పెరిగింది. కేవలం మూడేళ్లలో నగర ప్రజలపై ఆస్తి పన్ను మీదే ఏకంగా రూ.67.59 కోట్ల భారం మోపారు. గత నాలుగేళ్లుగా ఏటా 15 శాతం మేర ఆస్తి పన్ను పెంచేశారు. ఈ ఏడాది మరో 15 శాతం పెంచి పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. అంటే.. విజయవాడ పరిధిలో ప్రజలపై ఈ ఏడాది ఆస్తిపన్ను భారం రూ.237.10 కోట్లు పడబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని