Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 07 Jun 2024 13:06 IST

1. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. జగన్‌ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట..

పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. వార్తా పత్రికల్లో కాంగ్రెస్‌ పరువునష్టం కలిగించే ప్రకటనలు జారీ చేసిందని ఆరోపిస్తూ.. భాజపా కర్ణాటక యూనిట్‌ ఈ దావా వేసింది. దీని విచారణలో భాగంగా నేడు రాహుల్ కోర్టులో హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపాకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా

వైకాపాకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేశారు. లేఖను ఆ పార్టీ అధినేత జగన్‌కు పంపారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గతంలో తెదేపా అధినేత చంద్రబాబు అద్భుతమైన అవకాశం ఇచ్చారని.. ఆయన నాయకత్వంలో మంత్రిగా పనిచేశానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్డీయే ఎంపీల భేటీ.. మోదీ నాయకత్వానికి ఆమోదముద్ర

ఎన్డీయే ఎంపీలు దిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఈ భేటీలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక అతిథులు..ఎవరంటే?

జూన్‌ 9న మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, విదేశీ నేతలు,  ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా  ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎంఎంటీఎస్‌ రైళ్లు ఆలస్యంగా రావడంపై ప్రయాణికులు ఆగ్రహం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఎంటీఎస్‌ రైళ్లు సమయానికి రావడంలేదు. ఇష్టానుసారంగా సర్వీసులను నడిపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్‌..

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు సైతం ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అలాంటి సినిమాలు చేస్తే గుర్తింపు రాదు

హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విజయ్‌ సేతుపతి. తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్టీస్టారర్‌ చిత్రాల గురించి మాట్లాడారు. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

9. బ్యాంకులు రీ కేవైసీ అడుగుతున్నాయా? ఆన్‌లైన్‌లో సులువుగా చేసుకోండిలా.. 

బ్యాంకులో ఖాతా ఉన్నా.. మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేస్తున్నా.. ఇతర ఆర్థిక కార్యకలాపాలు సజావుగా జరగాలన్నా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. కస్టమర్ల ఖాతాకు భద్రతను పెంచడంతో పాటు, మోసాలను నివారించడంలో భాగంగా బ్యాంకులు కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని కోరుతుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. స్వర్ణగిరి దర్శనానికి వచ్చిన భక్తుల కారులో దూరిన పాము

యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కారులో పాము దూరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని