Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 11 May 2023 17:08 IST

1. రైతులపై కేసులు పెడితే తీవ్ర పరిణామాలు: పవన్‌ కల్యాణ్‌ హెచ్చరిక 

తిరుగుబాటు ఉంటే తప్ప రైతులను వైకాపా ప్రభుత్వం పట్టించునే పరిస్థితి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. జనసేన పర్యటన ఉందనగానే రాత్రికి రాత్రే ధాన్యం కోసం సంచులు ఇచ్చారని.. ముందే ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో రైతులతో పవన్‌ ముఖాముఖి నిర్వహించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రచారం అవాస్తవం.. జేపీఎస్‌లను చర్చలకు పిలవలేదు: ఎర్రబెల్లి దయాకర్‌రావు

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను (జేపీఎస్‌) రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఎవరూ జేపీఎస్‌లను చర్చలకు పిలవలేదని తెలిపారు. కార్యదర్శులు ఫోన్‌లో తనకు సమస్యలు చెప్పుకొన్నారని.. వెంటనే సమ్మె విరమించాలని వారికి సూచించినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉదయ్‌ కుమార్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దు.. అవినాష్ ప్రమేయమూ ఉంది: సీబీఐ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన డైరీని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. ఈ సందర్భంగా కేసులో ఏ6గా ఉన్న గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. హత్య కేసులో ఉదయ్ కుమార్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఐపీఎల్‌ 2023.. ప్లేఆఫ్స్‌కు చేరే ఆ నాలుగు జట్లు ఏవి..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 2023 (IPL 2023) సీజన్‌లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరాయి. మరో 15 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌ -4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయి. ఆరంభంలో కాస్త నెమ్మదిగా సాగిన మ్యాచ్‌లు.. ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పది జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు ఆసక్తికరంగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మైక్రోసాఫ్ట్‌లో ఈసారి వేతన పెంపుల్లేవ్‌..!

పూర్తిస్థాయి శాశ్వత ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపులు లేవని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ఉద్యోగులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గవర్నర్‌ నిర్ణయం తప్పే.. ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం: సుప్రీం

మహారాష్ట్ర( Maharashtra ) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే(Uddhav Thackeray) ఊరటనిచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది.  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను తిరిగి నియమించలేమని వ్యాఖ్యానించింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అన్ని పోలీసు జిల్లాల్లో డ్రోన్‌ నిఘా వ్యవస్థ.. అమలు చేసిన తొలి రాష్ట్రం కేరళ

దేశంలోనే తొలిసారిగా కేరళలోని అన్ని పోలీసు జిల్లాల్లో డ్రోన్‌ (drone) నిఘా వ్యవస్థను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 20 పోలీసు జిల్లాలకు ఒక్కో డ్రోన్‌ను అందించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్‌ పైలెట్‌లకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్‌ (anti-drone) సాఫ్ట్‌వేర్‌ను ఆయన ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ను కాపాడిన చైనా..!

పాకిస్థాన్‌(Pakistan) కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ అజర్‌(Abdul Rauf Azhar)ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలంటూ భారత్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా(China) అడ్డుకొంది. ఐరాస(UN) భద్రతా మండలి ‘1267 ఐఎస్‌ఐఎల్‌, అల్‌ఖైదా ఆంక్షల జాబితా’ కింద భారత్‌ తీర్మానానికి అడ్డుపుల్ల వేసింది. గతంలో కూడా పాక్‌ ఉగ్రవాదులపై ఐరాస ఆంక్షలు విధించకుండా అడ్డుకొన్న చరిత్ర చైనాకు ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రజాస్వామ్యం గెలిచింది.. సుప్రీం తీర్పుపై ‘ఆప్‌’ హర్షం!

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో పాలనా సర్వీసులపై స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయంటూ సుప్రీం కోర్టు (Supreme Court) వెలువరించిన తీర్పుపై దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య (Democracy) విజయమని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నాతో ఎక్కువగా పరుగులు పెట్టించొద్దని చెప్పా: ఎంఎస్ ధోనీ

చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK vs DC) చిత్తు చేసింది. సీఎస్‌కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ 140/8 స్కోరుకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ టార్గెట్‌ లేకపోయినా బౌలింగ్‌ వనరులను అద్భుతంగా వాడుకొని మరీ దిల్లీని కట్టడి చేయడంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు