Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Jun 2023 17:08 IST

1. తెదేపా ట్రాప్‌లో భాజపా: వైవీ సుబ్బారెడ్డి

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ గురించి కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. నగరానికి వచ్చి ఈ ప్రాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమన్నారు. విశాఖపట్నం పరిధి జ్ఞానాపురంలోని ఎర్నిమాంబ ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. దరఖాస్తు చేసుకోకపోయినా గ్రూప్‌-1 హాల్‌టికెట్‌.. వివరణ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ

గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా ఓ అభ్యర్థికి హాల్‌టికెట్ జారీ చేశారని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) వివరణ ఇచ్చింది. ఆ వార్తలను టీఎస్‌పీఎస్సీ అధికారులు ఖండించారు. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. ‘‘నిజామాబాద్‌ అభ్యర్థి జక్కుల సుచరిత గతేడాది గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేశారు. అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షకు ఆమె హాజరయ్యారు’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. దరఖాస్తుదారుడు ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు: మంత్రి గంగుల

బీసీ వృత్తి పనివారికి ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయంపై మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సాయం కోరుతూ ఇప్పటివరకు 50 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. అర్హులు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు. రెండేళ్ల నాటి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా పనిచేస్తాయని మంత్రి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. భాజపా పెద్ద హామీలు ఇస్తుంది. కానీ, వాటిని నెరవేర్చేందుకు యత్నించదు..

ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ఒకటి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ (Congress) నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్థానికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జబల్‌పుర్‌ (Jabalpur)లో సోమవారం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. ఉద్యోగ వాగ్దానాల నుంచి కుంభకోణాల వరకు అధికార భాజపా (BJP)పై విరుచుకుపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. 14 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. అదీ స్పేస్ఎక్స్‌లో!

ఓ కుర్రాడికి 14 ఏళ్ల వయసనగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఫ్రెండ్స్‌తో కబుర్లు, గ్రౌండ్‌లో ఆటలు, స్కూళ్లో పాఠాలు, సినిమాలు, షికార్లు.. ఇవే కదా! అవును మరి.. ఓ సాధారణ కుర్రాడి జీవితం ఇలాంటి చట్రంలోనే గడిచిపోతుంటుంది! కానీ, దీనికి భిన్నంగా ఓ పిల్లోడు మాత్రం 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీలో ఉద్యోగం కొట్టేశాడు. ఆ కుర్రాడి పేరే కైరన్‌ క్వాజీ. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కొవిన్‌ పోర్టల్‌ డేటా లీక్‌.. టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం!

దేశంలో మేజర్‌ డేటా లీక్‌ వెలుగుచూసింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్‌ పోర్టల్‌లోని (CoWIN portal) సున్నితమైన సమాచారం బయటకొచ్చింది. వ్యక్తుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఆధార్‌, పాన్‌ తదితర వివరాలు టెలిగ్రామ్‌లో (Telegram) ప్రత్యక్షమయ్యాయి. ఎవరైనా ఈ డేటాను యాక్సెస్‌ చేసే విధంగా అందుబాటులోకి రావడం కలకలం రేపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. విద్యపైనే మా రాజకీయాలు.. భాజపా, కాంగ్రెస్‌లపై మండిపడ్డ కేజ్రీవాల్‌

భాజపా, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్న సమయంలో విద్య గురించి అసలు నోరు విప్పలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఆరోపించారు. కానీ, తమ పార్టీ రాజకీయాలు మాత్రం కేవలం పిల్లల విద్యపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. పశ్చిమ దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఓ పాఠశాల కొత్త భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. రెండు పార్టీల తీరుపై మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మా దేశం నుంచి వెళ్లిపోండి.. భారత జర్నలిస్టుకు చైనా ఆదేశం

సరిహద్దు విషయంలో భారత్‌-చైనాల (India-China) మధ్య కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జర్నలిస్టుల (Journalist visa) విషయంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడనున్నట్లు కనిపిస్తోంది. చైనాలో విధులు నిర్వహిస్తోన్న చివరి భారత జర్నలిస్టును తమ దేశం నుంచి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు తాజాగా సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో బీఈడీ(BEd) ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాల (TS Ed-CET result) విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఆధ్వర్యంలో మే 18న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి(TSCHE) ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. ట్యాక్స్‌ పేయర్లు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు: అష్నీర్‌ గ్రోవర్‌

దేశంలో అమలౌతున్న ఆదాయపు పన్ను విధానంపై భారత్‌పే (BharatPe) మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ (Ashneer Grover) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పన్ను చెల్లింపు విధానంలో లోపాలు ఉన్నాయన్నారు. ట్యాక్స్‌ పేయర్లు తాము సంపాదిస్తున్న దాంట్లో 30-40 శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని, ప్రతిగా వారికి ఎలాంటి ప్రయోజనమూ ఉండడం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు