TSPSC: దరఖాస్తు చేసుకోకపోయినా గ్రూప్‌-1 హాల్‌టికెట్‌.. వివరణ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ

గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేసుకోనున్న ఓ అభ్యర్థికి హాల్‌టికెట్ ఇచ్చారని జరుగుతున్న వార్తలపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) వివరణ ఇచ్చింది.

Updated : 12 Jun 2023 15:23 IST

హైదరాబాద్‌: గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా ఓ అభ్యర్థికి హాల్‌టికెట్ జారీ చేశారని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) వివరణ ఇచ్చింది. ఆ వార్తలను టీఎస్‌పీఎస్సీ అధికారులు ఖండించారు. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. ‘‘నిజామాబాద్‌ అభ్యర్థి జక్కుల సుచరిత గతేడాది గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేశారు. అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షకు ఆమె హాజరయ్యారు. గ్రూప్‌-3, గ్రూప్‌-4 దరఖాస్తు చేస్తే గ్రూప్‌-1 హాల్‌టికెట్‌ ఇచ్చారన్న ప్రచారం అబద్ధం’’ అని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. 994 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 2,33,248 (61.37శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతేడాది జరిగి, రద్దయిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది (79.15 శాతం) హాజరుకాగా.. రెండోసారి నిర్వహించిన ఈ పరీక్షకు వారిలో దాదాపు 53 వేల మంది దూరంగా ఉండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని