TS EdCET Result: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

TS Ed-CET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Updated : 12 Jun 2023 16:32 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బీఈడీ(BEd) ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాల (TS Ed-CET result) విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఆధ్వర్యంలో మే 18న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి(TSCHE) ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించినట్టు లింబాద్రి వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో తాండూరుకు చెందిన జి.వినీషకు తొలి ర్యాంకు సాధించగా.. హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకుతో మెరిశారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని