Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 17 May 2023 17:05 IST

1. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించను: చంద్రబాబు హెచ్చరిక

నంద్యాలలో ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా తెదేపాలోని ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్నఘర్షణ ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. సీనియర్లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నంద్యాల ఘర్షణ ఘటనపై సమగ్ర అధ్యయనంతో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రారంభోత్సవ ఆఫర్‌.. ఈ-గరుడ బస్సు ఛార్జీల తగ్గింపు వివరాలివే

వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే.  హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో  ‘ఈ-గరుడ’ పేరుతో ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతున్నారు. కొత్త బస్సుల ప్రారంభం సందర్భంగా నెల రోజుల పాటు ఈ-గరుడ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్టు రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 307 సెక్షన్‌ కింద ఆళ్లగడ్డలో ఆమెను అరెస్ట్‌ చేసి పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై నేషనల్ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ విధించిన స్టే ఎత్తివేతకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపడుతున్న ఆవులపల్లి, నేతిగుట్టపల్లె, ముదివేడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల పనుల్ని వెంటనే ఆపాలని గతంలో ఎన్జీటీ గతంలో ఆదేశాలు జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అధిష్ఠానం మొగ్గు సిద్ధరామయ్య వైపే.. నేడు ప్రకటన వెలువడే అవకాశం!

కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister)పై గత కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. ముందుగా ఊహించినట్లుగానే సీనియర్‌ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) వైపే కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. సుదీర్ఘ మంతనాల తర్వాత.. సీఎం పగ్గాలను సిద్ధూకే అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీఎం రేసులో వెనక్కి తగ్గని డీకే.. సుర్జేవాలా కీలక వ్యాఖ్యలు

కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister) ఎంపికపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తదుపరి సీఎంగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న సయమంలో కాంగ్రెస్ (Congress) అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా (Randeep Surjewala) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపికపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బైడెన్‌కు ‘సీలింగ్‌‘ భయం.. క్వాడ్‌ దేశాధినేతల సదస్సు రద్దు

ఆస్ట్రేలియా వేదికగా వచ్చేవారం జరగబోయే క్వాడ్‌ సదస్సు రద్దయ్యింది. అగ్రరాజ్యంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సిడ్నీ పర్యటనకు రావట్లేదు. దీంతో క్వాడ్‌ దేశాధినేతల సదస్సును రద్దు చేస్తున్నట్లు ఆసీస్‌ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దాదాకు ‘జెడ్‌’ కేటగిరీ భద్రత.. ఇంతకుముందు ఏముందంటే?

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) భద్రత విషయంలో పశ్చిమ్‌ బంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ‘వై’ కేటగిరీలో ఉన్న దాదాకు ‘జెడ్‌’ కేటగిరీగా మార్చినట్లు సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు. గంగూలీకి మంగళవారంతో ‘వై’ కేటగిరీ భద్రత గడువు ముగియడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.20 వేలకే గంగా రామాయణ్‌ యాత్ర

భారత్‌లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీల (IRCTC Tour Package)ను అందిస్తోంది. నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే కావాల్సిన ప్రాంతాన్ని చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే ‘గంగా రామాయణ్‌ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట ఐఆర్‌సీటీసీ పలు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కెప్టెన్‌గా.. వారిలా మాత్రం ఉండలేను: డుప్లెసిస్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగా.. అందులోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక్క మ్యాచ్‌ ఓడినా సరే ఆశలు గల్లంతే. గురువారం హైదరాబాద్‌తో, మే 21న గుజరాత్‌తో బెంగళూరు తలపడనుంది. ఆర్‌సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతూ జట్టును నడిపిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు