Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 May 2023 17:09 IST

1. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది?: సీఎం కేసీఆర్‌

దేశం మొత్తం మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ఆవిర్భవించిందని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన భారాస కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ శిక్షణా శిబిరాన్ని కొనసాగించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే వార్తలు ఊహాజనితమే: సజ్జల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కన్న తల్లికి అనారోగ్యంగా ఉందని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అవినాష్‌ రెడ్డికి లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పథకాలకు వాలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లు: సీఎం జగన్‌

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంక్షేమ సారథులు వాలంటీర్లేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25 రకాల ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కోహ్లీ ‘18’ స్పెషల్‌.. ఆ నంబర్‌తో అనుబంధం కొనసాగుతోందిలా..

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ.. ఐపీఎల్‌లో తన సెంచరీ దాహాన్ని నాలుగేళ్ల తర్వాత తీర్చుకున్నాడు. గురువారం సన్‌రైజర్స్‌పై అద్భుత శతకాన్ని(100; 63 బంతుల్లో 12×4, 4×6) బాది.. మొత్తం ఆరు శతకాలతో గేల్‌ రికార్డును విరాట్‌ సమం చేశాడు. అయితే ఈ శతకం బాదింది మే 18న. ఈ నేపథ్యంలో ‘18’ నంబర్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా విరాట్‌ మరోసారి బయటపెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘నియంత్రణపరమైన లోపాలున్నాయని చెప్పలేం’.. ‘అదానీ’ వ్యవహారంపై నిపుణుల కమిటీ

అదానీ గ్రూప్‌పై (Adani group) వచ్చిన ఆరోపణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు కీలక నివేదిక సమర్పించింది. అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ధరల ర్యాలీ విషయంలో నియంత్రణ పరమైన లోపాలు జరిగాయని ప్రాథమికంగా అప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని తెలిపింది. అయితే, అదానీ గ్రూప్‌ విషయంలో హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌కు (Hindenburg) ముందు కొన్ని సంస్థలు షార్ట్‌ పొజిషన్లు తీసుకోవడం, రిపోర్ట్ తర్వాత స్టాక్‌ ధరలు పతనం అయినప్పుడు స్క్వేరింగ్‌ ఆఫ్‌ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘రక్షణ’ తయారీలో భారత్‌ రికార్డు.. తొలిసారి రూ.లక్ష కోట్లు దాటిన ఉత్పత్తి!

రక్షణ ఉత్పత్తుల తయారీ (Defence Production)లో భారత్‌ రికార్డు సృష్టించింది. తొలిసారిగా 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లకుపైగా విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేసింది. ప్రస్తుతం ఉత్పత్తుల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉండగా.. ఇంకా మరికొన్ని ప్రయివేటు రక్షణ సంస్థల నుంచి డేటా వస్తే మరింత పెరుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే.. అంబాసిడర్‌గా తొలగింపు..!

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని (Everest climber) అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన మేఘా పార్మర్‌ (Megha Parmar)కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ‘బేటీ బచావో బేటీ పడావో’, రాష్ట్ర డెయిరీ బ్రాండ్‌ సాంచికి ప్రచారకర్త (ambassador)గా ఉన్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. పార్మర్‌ కాంగ్రెస్‌లో చేరడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాజీ ఎంపీ రెమిషన్‌పై రికార్డులివ్వండి.. బిహార్‌కు సుప్రీం ఆదేశాలు

ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య (G Krishnaiah) హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ (Anand Mohan) మందుస్తు విడుదలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ జరిపింది. ఆయన శిక్షా కాలాన్ని తగ్గించి రెమిషన్‌ (remission) మంజూరు చేయడానికి సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులన్నింటినీ కోర్టుకు సమర్పించాలని బిహార్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అణుబాంబుకు ఆహుతై.. అగ్రరాజ్యాల సదస్సుకు వేదికై..!

మానవ చరిత్రలో తొలిసారి అణుబాంబు (Nuclear Bomb) తీవ్రతను చవిచూసిన నగరంగా హిరోషిమా చరిత్రలో నిలిచిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం (World War II)లో ఈ అణుబాంబు విధ్వంసానికి వేల మందిని కోల్పోవడంతోపాటు దశాబ్దాల పాటు జపాన్‌ (Japan) పౌరుల మౌనవేదనకు మారుపేరుగా నిలిచిందీ నగరం. లక్షల కుటుంబాల్లో విషాదగాథకు సాక్ష్యంగా నిలిచిన ఆ ప్రదేశమే ఇప్పుడు అగ్రదేశాల సదస్సు (జీ7)కు వేదికయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మైక్రోసాఫ్ట్‌ మా డేటాను అక్రమంగా వినియోగిస్తోంది: ట్విటర్‌

తమ డేటాను టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అక్రమంగా ఉపయోగించుకుంటోందని ట్విటర్‌ (Twitter) ఆరోపించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లకు గురువారం లేఖ రాసింది. ట్విటర్‌ డేటా వినియోగం విషయంలో మైక్రోసాఫ్ట్‌ నిబంధనలను అతిక్రమించిందని లేఖలో ఆరోపించింది. పైగా దీనికి డబ్బులు చెల్లించడానికి కూడా నిరాకరిస్తోందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని