Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 21 Apr 2023 17:00 IST

1. ఆర్‌-5 జోన్ వ్యవహారం.. తీర్పు రిజర్వ్‌

రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళికలో మార్పులు చేసి ఆర్‌-5 జోన్‌ (R-5 Zone) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్లపై తాజాగా హైకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘టీ-సేవ్‌’ నిరాహార దీక్షకు హైకోర్టు ఓకే

టీ-సేవ్‌ నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందిరాపార్కు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టే నిరాహార దీక్షకు షరతులతో కూడిన అనుమతిచ్చింది. నిరాహార దీక్షకు 500 మంది కంటే ఎక్కువ పాల్గొనవద్దని.. దీక్షకు 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ దీక్ష సాగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సింగరేణిపై చర్చకు సిద్ధమా? భారాసకు ఈటల సవాల్‌

కేంద్రంపై భారాస పదే పదే విషం చిమ్ముతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే ఆలోచన తమకు లేదని రామగుండం గడ్డ మీద నుంచి ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సింగరేణి విధి విధానాలపై కేంద్రం జోక్యం చేసుకోవట్లేదని.. రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. త్వరలో డీఎస్సీపై ప్రకటన: మంత్రి బొత్స

త్వరలో డీఎస్సీపై ప్రకటన చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ ఇదే!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50కి శంషాబాద్‌ నోవాటెల్‌కి చేరుకొని.. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ విజేతలతో తేనీటి విందులో పాల్గొననున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘కోహ్లీ రివ్యూ సిస్టమ్‌’ అంటే ఇదీ.. మైదానంలో విరాట్‌ దూకుడు

మనకు ధోనీ(MS Dhoni) రివ్యూ సిస్టమ్‌ తెలుసు. అతడు ఏదైనా రివ్యూ తీసుకున్నాడంటే.. ఫలితం అనుకూలంగా రావాల్సిందే. అంత కచ్చితంగా ఉంటాయి మహేంద్రుడి లెక్కలు. గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ(Virat Kohli) కూడా అంతే పక్కాగా కన్పించాడు. పెద్దగా అంచనాలు లేని చోట రివ్యూ(DRS) తీసుకొని.. సానుకూల ఫలితం పొంది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అక్షయ తృతీయ ఆఫర్లు.. ఆభరణాల కోనుగోలుపై రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు

హిందువులు శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని ఐశ్వర్యాలకు అధినేత్రిగా పూజిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటూ ఉండదని అంటుంటారు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) పర్వదినాన బంగారం కొనుగోలు చేయాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఊటీ’ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ప్యాకేజీ వివరాలివే..

‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’ పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. మార్చి 28 నుంచి జూన్‌ 27 వరకు ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, తెనాలి రైల్వేస్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. ఊటీ ప్రయాణం ముగించుకున్నాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఈ టూర్‌ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సూడాన్‌లో 4వేల మంది భారతీయులు.. ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష..!

సూడాన్‌లో (Sudan) సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (RSF)కు మధ్య జరుగుతోన్న సాయుధ పోరాటంలో వందలమంది పౌరులు, సైనికులు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. చర్చలకు ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ అవి కొలిక్కి రావడం లేదు. దీంతో అక్కడున్న సుమారు 4వేల మంది భారత పౌరుల్లో ఆందోళన మొదలయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రష్యా ఘోర తప్పిదం.. సొంత నగరంపైనే బాంబు..!

ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యా.. తాజాగా సొంత నగరంపైనే బాంబు దాడి చేసింది. నాలుగు లక్షల జనాభా ఉన్న పట్టణంపై తన యుద్ధ విమానం నుంచి ఓ ఆయుధాన్ని జారవిడిచింది. పేలుడు ధాటికి నగరంలో ఓ కూడలి వద్ద దాదాపు 40 మీటర్ల వ్యాసంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. సమీపంలోని భవనాలు ధ్వంసం కావడంతోపాటు వాహనాలూ ఎగిరిపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని