Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 25 May 2023 17:16 IST

1. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ 

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2  పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పచ్చజెండా ఊపారు. సుమారు 1000కి పైగా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీపై సీఎం గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. టీఎస్‌పీఎస్సీ జూన్‌ 11న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివిధ నియామక పరీక్షల మధ్య వ్యవధి ఉండాలన్న నిబంధనను పాటించట్లేదని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. పొంగులేటి, జూపల్లితో మళ్లీ ఈటల రాజేందర్‌ సుదీర్ఘ భేటీ

భారాస బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ మరోసారి భేటీ అయ్యారు. నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో దాదాపు నాలుగు గంటలుగా చర్చలు జరుపుతున్నారు. గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి హాజరుకానున్న తెదేపా

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి తెదేపా హాజరుకానుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28న పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమానికి రావాలంటూ అన్ని రాజకీయ పార్టీలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపారు. ఈ నేపథ్యంలో తెదేపా తరఫున హాజరుకావాల్సిందిగా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు చంద్రబాబు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం.. గవర్నర్‌ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయ అంశంతో ముడిపెడుతూ మాట్లాడారు. చెన్నైలో మీడియాతో ఆమె మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రైవేటు బస్సు బోల్తా.. 63మందికి గాయాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కూకుటిమానగడ్డ సమీపంలో కారును వెనక నుంచి ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 56 మందికి స్వల్ప గాయాలు కాగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పార్లమెంటు భవనం ప్రారంభ వివాదం.. సుప్రీం కోర్టులో పిల్‌!

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై ప్రభుత్వం, విపక్షాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. తాజాగా ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. మే 28న పార్లమెంటు కొత్త భవన ప్రారంభం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. సిడ్నీలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ 7 అంతస్తుల భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి పక్కనున్న భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సర్సీ హిల్స్‌లోని ఏడంతస్తుల భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదం.. విపక్షాలకు మోదీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకను బహిష్కరిస్తూ విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) పరోక్షంగా తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని మోదీ గురువారం ఉదయం భారత్‌ చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కొంప ముంచిన రనౌట్లు!

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయానికి ఆకాశ్‌ మధ్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శన ఒక కారణం అయితే.. రనౌట్లు మరో కారణం అని చెప్పాలి. సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో మొత్తంగా మూడు రనౌట్లు నమోదయ్యాయి. ఈ కారణంగానే ఎనిమిదో నంబర్‌ వరకు బ్యాటర్లు ఉన్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) 101 పరుగులకే అలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని