Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jun 2023 17:14 IST

1. ఈ-గవర్నెన్స్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌: మంత్రి కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను కలవటం లేదని, ప్రజా దర్బార్‌ నిర్వహించటం లేదని కొంతమంది చేస్తోన్న విమర్శలకు పురపాలక శాఖ మంత్రి బదులిచ్చారు. ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే సమస్య తన వరకు వస్తుందని సీఎం అన్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చి, పాలనను ప్రజల వద్దకు చేర్చారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘మనిషిని చంపడం ఎలా?’.. ఇంటర్నెట్‌లో శోధించి పథకం ప్రకారమే హత్య

నగరంలో సంచలనం రేపిన అప్సర హత్య (Apsara Murder Case) రిమాండ్‌ రిపోర్టులో (Remand Report) కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్లు తేలింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి పూజారి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడిందని, క్రమంగా అది వివాహేతర బంధానికి దారితీసిందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టికెట్‌ కోసం జగన్‌ను ఐదుసార్లు కలిసినా ప్రయోజనం లేదు: ఎమ్మెల్యే మేకపాటి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో లోకేశ్‌ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై లోకేశ్‌తో చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కష్టపడి పని చేయాలి.. సర్వే ప్రాతిపదికనే టికెట్లు: రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే ఉదాహరణ అని చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా  నాలుగు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాహుల్‌.. మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకోండి: అమిత్‌ షా

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన విదేశీ పర్యటనల్లో భారత అంతర్గత రాజకీయాలను ప్రస్తావిస్తుండడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో రాహుల్‌ తమ పూర్వీకుల నుంచైనా నేర్చుకోవాలని హితవు పలికారు. గుజరాత్‌ పాటన్‌ జిల్లాలోని సిద్ధ్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అజిత్‌ మళ్లీ పక్కకే.. ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) పార్టీ బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి కొత్తగా ఇద్దరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రకటించారు. అయితే, ఇందులో కీలక నేత అజిత్ పవార్‌ (Ajit Pawar)కు చోటు దక్కకపోవడం గమనార్హం. తన కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule), సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌ (Praful Patel)కు పవార్‌ ఈ బాధ్యతలు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ChatGPT ఫౌండర్‌ సవాల్‌ను స్వీకరించిన టెక్‌ మహీంద్రా సీఈఓ!

టెక్‌ ప్రపంచంలో ఇప్పుడు కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాట్‌జీపీటీ (ChatGPT) వచ్చిన తర్వాత ఈ రంగంలో పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సహా అన్ని కంపెనీలు తమ ఏఐ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ (OpenAI) కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) భారత్‌లో పర్యటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెండు వాహక నౌకలు.. 35కుపైగా యుద్ధవిమానాలతో విన్యాసాలు.. సత్తాచాటిన నౌకాదళం!

భారత నౌకా దళం (Indian Navy) తన సత్తాను మరోసారి చాటుకుంది. రెండు యుద్ధవిమాన వాహక నౌకలతోపాటు జలంతర్గాములు, ఇతర యుద్ధనౌకల కార్యకలాపాలను ఏకకాలంలో సమన్వయం చేస్తూ.. ‘ట్విన్‌ క్యారియర్‌ సీబీజీ ఆపరేషన్స్‌’ను విజయవంతంగా నిర్వహించింది. అంటే.. రెండు వాహక నౌకలతోకూడిన యుద్ధ బృందంతో ఏకీకృత కార్యకలాపాలు నిర్వహించడం. అరేబియా సముద్రంలో ఈ మేరకు విన్యాసాలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శరద్‌ పవార్‌కు బెదిరింపులు.. పంపింది భాజపా కార్యకర్త..?

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar)కు ‘హత్య బెదిరింపులు’ రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై సత్వర దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ బెదిరింపు సందేశాలను అమరావతికి చెందిన భాజపా కార్యకర్త (BJP Activist) సౌరభ్‌ పింపాల్కర్‌ పంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చాట్‌జీపీటీ తప్పుడు సమాచారం.. కోర్టుకు సారీ చెప్పిన లాయర్‌

ఇంటర్నెట్‌లో సరికొత్త సాంకేతికత చాట్‌జీపీటీపై ఆధారపడుతున్నారా? దాన్ని అడిగే సమాచారం సేకరిస్తున్నారా? అయితే.. అది ఇచ్చే ఫలితాల్ని ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోండి. లేదంటే.. ఇబ్బందుల్లో పడతారు. తాజాగా చాట్‌జీపీటీని నమ్ముకున్న ఓ న్యాయవాది.. కోర్టులో న్యాయమూర్తి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. మాన్‌హట్టన్‌కు చెందిన ఓ వ్యక్తి విమాన సంస్థపై దావా వేశాడు. 2019లో కొలంబియన్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో సిబ్బంది కారణంగా తన కాలుకు గాయమైందని.. పరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని