Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 13 Aug 2023 17:00 IST

1. నడకదారుల్లో పిల్లల అనుమతిపై తితిదే ఆంక్షలు

చిరుతల సంచారం దృష్ట్యా తిరుమల నడకదారుల్లో పిల్లల అనుమతిపై తితిదే ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు నడకదారిలో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్‌ వేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పంద్రాగస్టు వేడుకలు.. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆంక్షల సమయంలో రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వచ్చే రోడ్డు పూర్తిగా మూసివేయనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌లో చేరుతున్నా: మాజీ మంత్రి చంద్రశేఖర్‌

తెలంగాణలో ప్రజల్లో భాజపా గ్రాఫ్‌ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్‌ అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను మార్చడం తనకు నచ్చలేదని చెప్పారు. అలా ఎందుకు మార్చారో అర్థం కావడం లేదన్నారు. భాజపాకు రాజీనామా చేసిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మీకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది: ఖర్గే

దేశ ఆరోగ్య వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని విమర్శించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆర్జీవీకి తెదేపా నేత దేవినేని ఉమ సవాల్‌

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ షూటింగ్‌ తీయడంపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర సంగమం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పట్టిసీమ పథకం దండగని ప్రచారం చేసిన వైకాపా నాయకులు ఇవాళ ఏ మొహం పెట్టుకొని సినిమా షూటింగ్‌లు చేయిస్తున్నారు. ఆర్జీవీకి దమ్ముంటే తెదేపా నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలి’’ అని సవాల్‌ విసిరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ దొంగ స్టైలే వేరు.. క్యాబ్‌ డ్రైవర్‌ను బిర్యానీ తెమ్మని కారుతో పరారీ

క్రైమ్‌ బ్రాంచి పోలీసుని.. హైదరాబాద్‌ వెళ్లాలని కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గ మధ్యలో హోటల్‌ వద్ద ఆపి క్యాబ్‌ డ్రైవర్‌ను బిర్యాని తెమ్మని చెప్పి కారుతో సహా ఉడాయించాడు ఓ అగంతకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విద్యార్థులపై పరీక్షల భారం.. ‘ఐఐటీ దిల్లీ’ కీలక నిర్ణయం!

దేశవ్యాప్తంగా ఆయా ఐఐటీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలవరపెడుతున్నాయి. వ్యక్తిగత సమస్యలతోపాటు చదువులు, పరీక్షల ఒత్తిడి కూడా విద్యార్థుల బలవన్మరణాలకు కారణమవుతోందనే వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాల నడుమ ఐఐటీ దిల్లీ (IIT Delhi) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారిపై పరీక్షల భారాన్ని తగ్గించేందుకు.. తన పరీక్షా విధానంలో మార్పులు చేపట్టింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జయలలితకు అవమానంపై.. తమిళనాట మాటల యుధ్ధం

గతంలో తమిళనాడు అసెంబ్లీలో దివంగత జయలలితకు అవమానం జరిగిందని (Jayalalithaa assault) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. దాడి జరగడం వాస్తవం కాదని, జయలలిత నటించారన్న విషయం ఆనాడు సభలో ఉన్న ప్రతిఒక్కరికీ తెలుసన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సీమాహైదర్‌ను నటిగా చూపించడమా?

పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌కు (Seema Haider) బెదిరింపులు ఎదురవుతున్నాయి. ప్రియుడు సచిన్‌ (Sachin), హైదర్‌ల ప్రేమకథ ఆధారంగా బాలీవుడ్‌ నిర్మాత అమిత్‌ జాని (Amit Jani) ‘ కరాచీ టు నోయిడా’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో సీమా హైదర్‌ను కథానాయికగా ఎంపిక చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాకిస్థాన్‌లో చైనా ఇంజినీర్లపై మజీద్‌ బ్రిగేడ్‌ దాడి..!

పాకిస్థాన్‌(Pakistan)లో చైనా(China)కు చెందిన ఇంజినీర్ల వాహనశ్రేణిపై ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్‌లోని అత్యంత కీలకమైన గ్వాదర్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. స్థానికంగా ఉన్న ఫకీర్‌ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే రెబల్స్‌ కాల్పులు జరిపారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ పేరిట ఓ ప్రకటన విడుదలైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని