Chandra shekhar: రేవంత్‌ ఆహ్వానించారు.. కాంగ్రెస్‌లో చేరుతున్నా: మాజీ మంత్రి చంద్రశేఖర్‌

తెలంగాణలో ప్రజల్లో భాజపా గ్రాఫ్‌ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్‌ అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను మార్చడం తనకు నచ్చలేదని చెప్పారు.

Updated : 13 Aug 2023 14:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజల్లో భాజపా గ్రాఫ్‌ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్‌ అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను మార్చడం తనకు నచ్చలేదని చెప్పారు. అలా ఎందుకు మార్చారో అర్థం కావడం లేదన్నారు. భాజపాకు రాజీనామా చేసిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు.  

భాజపా, భారాస ఒక్కటేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్‌లోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానించారని.. ఆయన ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరతానని చంద్రశేఖర్‌ ప్రకటించారు.

భాజపాలో పనిచేసేవారిని ప్రోత్సహించడం లేదంటూ చంద్రశేఖర్‌ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు