Hyderabad: పంద్రాగస్టు వేడుకలు.. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఇలా..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Updated : 13 Aug 2023 15:52 IST

హైదరాబాద్‌: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆంక్షల సమయంలో రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వచ్చే రోడ్డు పూర్తిగా మూసివేయనున్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఇప్పటికే పాసులు జారీ చేసిన అధికారులు.. ఆ మార్గంలో A గోల్డ్, A పింక్‌, B బ్లూ పాసులు కలిగిన వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. పాసులు ఉండి సికింద్రాబాద్ నుంచి వచ్చేవారు బంజారాహిల్స్ - మెహదీపట్నం - రేతిబౌలి - నాలానగర్ - లంగర్ హౌస్ వంతెన - రాందేవ్‌గూడ మీదుగా గోల్కొండ చేరుకోవాలని సూచించారు. 

A గోల్డ్ పాస్ కలిగిన వారు కోట ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని వెల్లడించారు. A పింక్ పాస్ వారు గోల్కొండ బస్ స్టాప్‌లో, B బ్లూ పాస్ కలిగిన వారు ఫుట్‌బాల్‌ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. C గ్రీన్ పాస్ కలిగిన వారు సెవెన్ టూబ్స్‌, బంజారా దర్వాజా మీదుగా వచ్చి ఒవైసి జీహెచ్‌ఎంసీ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలన్నారు. D రెడ్ పాస్ కలిగిన వారు షేక్‌పేట - టోలిచౌక్‌ - బంజారా దర్వాజా మీదగా వచ్చి ప్రియదర్శిని స్కూల్ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. E బ్లాక్ పాస్ కలిగిన సాధారణ ప్రజలు హుడా పార్క్‌లో పార్కింగ్ చేసుకొని వేడుకలకు హాజరు కావాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని