Mallikarjun Kharge: మీకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది: ఖర్గే

కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు.

Updated : 13 Aug 2023 13:02 IST

దిల్లీ: దేశ ఆరోగ్య వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని విమర్శించారు. దేశంలోని 19 ఎయిమ్స్‌లలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. 

సోషల్‌ మీడియా డీపీలు మారుద్దాం.. దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

‘‘కేంద్రంలోని దోపిడీ సర్కార్‌ దేశ ఆరోగ్య వ్యవస్థను అనారోగ్యంగా మార్చింది. మోదీజీ మాట్లాడే ప్రతి మాటలో కేవలం అబద్ధాలు మాత్రమే ఉంటాయి. దేశవ్యాప్తంగా చాలా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, నిజం ఏంటంటే.. దేశంలోని ఎయిమ్స్‌లు తీవ్రంగా వైద్యుల, సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. కరోనా సమయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించింది. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో స్కామ్‌లకు పాల్పడ్డారు. కానీ, ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. మీ ప్రభుత్వానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది’’ అని ఖర్గే ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు