Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు@ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 02 Apr 2024 16:59 IST

1.కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం: రేవంత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నిలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 6న నిర్వహించనున్న ‘జనజాతర’ సభ ఏర్పాట్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. దిల్లీ మద్యం కేసు.. ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెయిల్‌

దిల్లీ మద్యం పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు వరుసగా అరెస్టవుతున్న తరుణంలో.. ఆ పార్టీకి కాస్త ఊరట కలిగింది. ఈ వ్యవహారంలో ఆరు నెలల క్రితం అరెస్టయిన ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు (Sanjay Singh) సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ట్రయల్‌ కోర్టు విధించిన షరతులకు లోబడి నడుచుకోవాలని ఆయన్ని ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కంపెనీని వీడితే 9 నెలల వేతనం.. ఉచిత కెరీర్‌ కోచింగ్‌: మెకిన్సీ

 ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా వస్తున్న అత్యాధునిక మార్పులతో పాటు ఆర్థిక అనిశ్చితులే దీనికి కారణం. వడ్డీరేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు కంపెనీల కార్యకలాపాలను దెబ్బతీశాయి. దీంతో ఖర్చుల నియంత్రణలో భాగంగా సిబ్బంది సంఖ్యలో కోత పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ ‘మెకిన్సీ అండ్ కంపెనీ’ (McKinsey & Company) సైతం బ్రిటన్‌లోని తమ కంపెనీ ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌, సునీతకు హైకోర్టులో ఊరట

సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌,  వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పులివెందుల మేజిస్ట్రేట్‌ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు రామ్‌సింగ్‌, సునీత, రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో వీరు పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి చర్యలు చేపట్టకుండా నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌.. 111 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీల లాభాల జోరుకు బ్రేక్‌ పడింది. మూడు రోజుల పాటు వరుసగా లాభపడిన సూచీలు.. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో నష్టాలు చవిచూశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం వంటివి ఇందుక్కారణం. అమెరికాలో తాజాగా వెలువడిన గణాంకాలు వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావొచ్చన్న ఆందోళనలు పెంచాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘అసలు అదేం భాష’: రాహుల్‌ గాంధీపై మోదీ ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్రధాని నరేంద్రమోదీ (Modi) ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం అట్టుడుకుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఖండించారు. అసలు అదేం భాష అని విమర్శించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రపుర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. జొమాటోకు రూ.184 కోట్ల పన్ను, పెనాల్టీ నోటీసు

ప్రముఖ పుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు (Zomato).. ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీసు అందింది. సర్వీస్‌ ట్యాక్స్‌, పెనాల్టీ కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని ఆ శాఖ ఆదేశించింది. దీనిపై అప్పీల్‌కు వెళతామని జొమాటో పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా: వైఎస్‌ షర్మిల

వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్‌ .. కడప ఎంపీ టికెట్‌ ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన అనంతరం ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. దండకారణ్యంలో భీకర ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టుల మృతి

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. బీజాపుర్‌ (Bijapur) జిల్లాలోని దండకారణ్యంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని