Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Jun 2024 16:59 IST

1. ఇక్కడ విజయం సాధిస్తే.. గెలుపు సునామీనే..

 భారత ప్రజాస్వామ్య పండగలో తుది అంకానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను ప్రకటించి ఒక ఊపు తీసుకువచ్చాయి. మంగళవారం కౌంటింగ్‌తో ఏ పార్టీ జయకేతనం ఎగరవేయనుందో పూర్తి స్పష్టత వస్తుంది. తమ నియోజకవర్గంలో ఫలితం కోసం అభ్యర్థులు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో బెల్‌వెదర్ సీట్ల (Bellwether Seats)పైనే అందరి దృష్టి ఉంది. పూర్తి కథనం

2. ఎన్డీయే vs ఇండియా కూటమి.. ఏ పార్టీ ఎవరితో..?

సుదీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికలు.. తుది ఘట్టానికి చేరాయి. ఏడు దశల్లో పోలింగ్‌ జరగ్గా.. రేపటితో (జూన్‌ 4న) విజేతలెవరో తేలిపోనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌ (Exit polls) కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంచనాలు వెలువరించాయి. ఈ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలో ఎన్డీయే కూటమి (NDA) ఒకవైపు.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా (INDIA bloc) ఏర్పడి తలపడ్డాయి. పూర్తి కథనం

3. రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?: కృతిశెట్టి రియాక్షన్‌ ఏంటంటే

 ‘బేబమ్మ’ (ఉప్పెన చిత్రం)గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కృతిశెట్టి (Krithi Shetty). త్వరలోనే ‘మనమే’ (Manamey)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. పూర్తి కథనం

4. ఆరోజు సీతారామశాస్త్రి ఎంతో బాధపడ్డారు: తనికెళ్ల భరణి

ప్రముఖ గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు నటుడు తనికెళ్ల భరణి. ఆయన సొంత అన్నయ్యతో సమానమన్నారు. సీతారామశాస్త్రి కలం పేరు భరణి అని తెలిపారు. పూర్తి కథనం

5. గెలిచినా.. ఓడినా పాక్‌ ఫ్యాన్స్‌ దృష్టంతా మనమీదే: యువరాజ్‌ సింగ్

ప్రపంచ కప్‌ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యం. కేవలం ఒక్కసారి మాత్రమే పాక్ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి టీ20 వరల్డ్‌ కప్‌లో (T20 World Cup 2024) ఇరుజట్లూ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.  పూర్తి కథనం

6. 20 రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏలోకి: ఎమ్మెల్యే రవి రాణా

భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) అధికారంలోకి వచ్చిన తర్వాత  శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) అందులో చేరే అవకాశం ఉందని మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణా(Ravi Rana) ఆదివారం అన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి భాజపా అధికారం చేపడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  పూర్తి కథనం

7. ఫలితాల వేళ.. భాజపా నేతల కీలక భేటీ.. రాజకీయ పరిస్థితులపై వ్యూహాలు

సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. మూడోసారి కూడా కేంద్రంలో భాజపా (BJP)నే ప్రభుత్వం ఏర్పాటుచేయనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. పూర్తి కథనం

8. ఉ.కొరియా వర్సెస్‌ ద.కొరియా.. ‘మిలటరీ డీల్‌’ రద్దుకు ‘సై’

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూభాగంలో చెత్త, వ్యర్థాలతో కూడిన వందల బెలూన్లను ఉత్తర కొరియా జారవిడవడాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కొరియా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా కిమ్‌ రాజ్యంతో చేసుకున్న మిలిటరీ ఒప్పందానికి మంగళం పాడనున్నట్లు పేర్కొంది. పూర్తి కథనం

9. ‘హీరామండి-2’ ప్రకటించిన దర్శకుడు.. ఏం చూపనున్నారంటే!

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. భారీ తారాగణంతో పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ బాలీవుడ్‌ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. పూర్తి కథనం

10. పేర్ని నాని, సజ్జలను పోలీసులు అదుపులోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

ఎన్నికల కౌంటింగ్‌ రోజు అల్లర్లకు వైకాపా నేతలు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు. వారిద్దరినీ పోలీసులు వెంటనే అందుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని