Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 May 2024 17:14 IST

1. కొండచరియల బీభత్సం ఘటన.. 670 మంది సమాధి..!

పసిఫిక్‌ దేశమైన పపువా న్యూ గినియా (Papua New Guinea)లోని ఎన్గా ప్రావిన్స్‌లో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి (Landslide) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ ప్రకృతి విపత్తు కారణంగా తొలుత 100 మందికిపైగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐరాస (UN) తాజాగా అంచనా వేసింది. దాదాపు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (IOM)’ తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జూన్ 14 తర్వాత ఆ ఆధార్‌ కార్డులు పనిచేయవా? ఉడాయ్‌ వివరణ..

ఆధార్‌కు (Aadhaar Card) సంబంధించి సోషల్‌ మీడియా సహా బయట ఈ మధ్య తెగ చర్చ జరుగుతోంది. జూన్‌ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వదంతులను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) కొట్టిపారేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, మల్కాజిగిరి, తుర్కయంజాల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఈ ఎన్నికలు మోదీ Vs రాహుల్ కాదు.. వారి మధ్యే..: ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ‘ముజ్రా డ్యాన్స్‌’ చేస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రధాని బిహార్‌ను అవమానించారని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఆరోగ్య బీమా క్లెయిమ్‌ చిక్కులకు చెక్‌.. త్వరలో ప్రభుత్వ పోర్టల్‌!

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లు మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్‌కు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్‌ క్లెయిమ్‌ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. గడ్కరీని భాజపా అగ్రనేతలే ఓడించాలనుకున్నారు.. సంజయ్‌ రౌత్‌ సంచలన ఆరోపణలు!

భాజపా అగ్రనేతలపై శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని (Nitin Gadkari) నాగ్‌పూర్‌లో ఓడించేందుకు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కలిసి పనిచేశారని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. పిన్నెల్లి సోదరుల కంటే కిమ్‌ బెటర్‌: తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ మాణిక్యరావు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పోలింగ్‌ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. అంతు చూస్తామని నన్ను బెదిరించారు’’ అని వాపోయారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.  పట్టాలు తప్పిన గూడ్స్‌.. గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లకు అంతరాయం

గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తోన్న గూడ్స్‌ రైలు పక్కకు ఒరిగిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఐపీఎల్ ‘ఫైనల్‌’ వెదర్‌ రిపోర్ట్.. మ్యాచ్‌ జరగకపోతే పరిస్థితేంటి?

ఐపీఎల్ 17వ సీజన్‌ టైటిల్‌ కోసం కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. చెన్నైలోని చెపాక్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తోంది. నిన్న వర్షం పడటంతో కోల్‌కతా తన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుంది. ఇవాళ కూడా ఆకాశమంతా మబ్బులతో నిండి ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మొదటి అంతస్తు నుంచి దూకేశాం...

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమ్‌జోన్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని, శిథిలాల్లో మరికొందరి మృతదేహాలు ఉండొచ్చని తెలిపారు. కాగా మంటలు చెలరేగుతున్న సమయంలో కొందరు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలతో బయట పడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని