ఆరోగ్య బీమా క్లెయిమ్‌ చిక్కులకు చెక్‌.. త్వరలో ప్రభుత్వ పోర్టల్‌!

Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్రం త్వరలోనే సరికొత్త పోర్టల్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

Published : 26 May 2024 16:49 IST

Health Insurance | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లు మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్‌కు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్‌ క్లెయిమ్‌ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా ఉండనుంది. బీమా రంగంలోనే ఇదొక కీలక మలుపుగా మారనుంది.

నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంలో భాగంగా కొత్త పోర్టల్‌ను తీసుకురానున్నారు. దీంతో ఆరోగ్య బీమా క్లెయిమ్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.  రానున్న రెండు లేదా మూడు నెలల్లో దేశమంతంటా ఈ పోర్టల్‌ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం . దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే 50 బీమా కంపెనీలు, 250 ఆసుపత్రులను అనుసంధానించింది. క్రమంగా మరిన్ని ఆసుపత్రులు, బీమా ప్రొవైడర్లనూ అందులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

అందరి చూపు క్యాన్సర్‌ మందులపైనే

ఇప్పటికే టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్, పారామౌంట్ TPA, బజాజ్ అలయన్జ్ ఇన్సూరెన్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు పోర్టల్‌తో అనుసంధానాన్ని పూర్తి చేశాయి. ప్రస్తుతం  దేశంలో ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ ప్రక్రియ ప్రధానంగా మాన్యువల్ విధానాలపై ఆధారపడి ఉంది. దీంతో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే కేంద్రం ఈ కొత్త పోర్టల్‌ను తీసుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు