Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 09 Feb 2024 21:17 IST

1. Congress: ఏపీ మంత్రులను ఈడీ ఎందుకు వదిలేసింది?: కాంగ్రెస్‌ నేత కేవీపీ

భాజపాయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఈడీ.. ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసిందని కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం విక్రయాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో భాజపాకు ఏమైనా వాటాలు అందుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి కథనం

2. TS Assembly: కృష్ణా జలాలపై.. హరీశ్‌రావు vs ఉత్తమ్‌

నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వ వైఖరి వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్‌ను వెంటనే మన ఆధీనంలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. పూర్తి కథనం

3. Balakrishna: వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి: బాలకృష్ణ

వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) సూచించారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఆయన శుక్రవారం పర్యటించారు. శ్రీకంఠపురంలో వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూర్తి కథనం

4. Elon Musk: ‘నా ఫోన్‌ నంబర్‌ వాడటం ఆపేస్తా’: ఎలాన్ మస్క్‌ పోస్టు

ఎక్స్‌(ట్విటర్) అధినేత ఎలాన్‌ మస్క్‌(Elon Musk) వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తుంటారు. తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. త్వరలో తాను ఫోన్‌ నంబర్ వాడటం ఆపేస్తానని చెప్పారు. ‘కొన్ని నెలల్లో నేను నా ఫోన్‌ నంబర్‌ వాడటం నిలిపేస్తాను. సందేశాలు పంపేందుకు, ఆడియో, వీడియో కాల్స్‌కు ఎక్స్‌ను మాత్రమే ఉపయోగిస్తాను’ అని పోస్టు పెట్టారు. పూర్తి కథనం

5. Telangana news: టీఎస్‌ ఈసెట్‌, లాసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈసెట్‌ (TS ECET), లాసెట్‌ (LAW CET) షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈనెల 15 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 22 వరకు, రూ.1000 చెల్లిస్తే ఏప్రిల్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే1 నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, 6న ఈసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి కథనం

6. NEET UG 2024: నీట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. దరఖాస్తులు మొదలయ్యాయ్‌..

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (NEET UG 2024) పరీక్షకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి కథనం

7. సమస్యలపై వాదించేటప్పుడు సంస్థల పేర్లు తీసుకురావద్దు : ఓం బిర్లా

లోక్‌సభలో ఒక సమస్యపై చర్చ జరిగేటప్పుడు సంస్థ (organisation)ల పేర్లు ప్రస్తావించకూడదని స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం సభ్యులను హెచ్చరించారు. ఇక్కడ ఎంపీలు విధానపరమైన విషయాలను మాత్రమే చర్చించాలని సూచించారు. పూర్తి కథనం

8. U19 World Cup Final: అండర్-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌.. ఆసీస్‌పై భారత్ లీడ్‌ 3-0కు వెళ్లేనా?

డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. గ్రూప్‌, సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌లో సునాయాస విజయాలు.. తీరా, సెమీస్‌లో ఓటమి ప్రమాదం. కెప్టెన్ ఉదయ్‌ సహరన్, సచిన్‌ దాస్ జట్టును కాపాడటంతో ఫైనల్‌కు టీమ్‌ఇండియా. వరుసగా ఐదోసారి, మొత్తంగా తొమ్మిదోసారి అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. పూర్తి కథనం

9. Kadapa: కబ్జాకోరల్లో ఉపాధ్యాయుల భూములు..!

సీఎం సొంత జిల్లాలో ఉపాధ్యాయులకు చెందిన వంద ఎకరాల భూమికి రక్షణ లేకుండా పోయింది. మూడు దశాబ్ధాల క్రితం కొనుగోలు చేసిన భూమికి.. ఇపుడు కోట్ల రూపాయల ధర పెరగటంతో.. కబ్జాదారుల కన్ను ఆ భూమిపై పడింది. నకిలీ పత్రాలు సృష్టించి 94 ఎకరాల భూమి తమదేనంటూ అక్రమార్కులు.. ఆ ఉపాధ్యాయులపై దాడి చేయడమే కాకుండా.. భూమిలోకి రాకుండా ఆంక్షలు విధించారు. పూర్తి కథనం

10. Bharat Ratna 2024: ఇప్పటివరకు ఐదుగురికి భారత రత్న... ఒకే ఏడాదిలో ఇదే అత్యధికం

ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఐదుగురికి ‘భారతరత్న (Bharat Ratna)’ ప్రకటించింది. ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో 1999లో గరిష్ఠంగా నలుగురికి ప్రదానం చేశారు. 1954 మొదలు ఈ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కు చేరింది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని