Telangana news: టీఎస్‌ ఈసెట్‌, లాసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈసెట్‌ (TS ECET), లాసెట్‌ (LAW CET) షెడ్యూల్‌ని విడుదల చేసింది.

Published : 09 Feb 2024 17:21 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈసెట్‌ (TS ECET), లాసెట్‌ (LAW CET) షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈనెల 15 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 22 వరకు, రూ.1000 చెల్లిస్తే ఏప్రిల్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే1 నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, 6న ఈసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

28న లాసెట్‌ నోటిఫికేషన్‌..

ఈనెల 28న లాసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 3న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు నిర్వహిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని