Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రాగల 3రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు.. ఏపీలో వేడిగాలుల ప్రభావం
తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఆర్-5జోన్‌లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
రాజధానిలో ఆర్-5జోన్‌లో ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సీఆర్డీఏ పరిధిలోని ఆర్-5జోన్‌లో 47,017 ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించారు. రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాల మేరకు గృహనిర్మాణశాఖ ఈ ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆర్-5 జోన్‌లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 51,392 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అది క్లాసిక్ ప్రదర్శన.. క్లాసెన్ సెంచరీపై సచిన్ ప్రశంసలు
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తరఫున నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది హెన్రిక్ క్లాసెన్ (Heinrich Klaasen) మాత్రమే. గురువారం బెంగళూరు (Royal Challengers Bangalore)పై మ్యాచ్ ఓడిపోయినా క్లాసెన్ శతకాన్ని(104; 51 బంతుల్లో 8×4, 6×6) ఎవరూ మర్చిపోలేరు. అతడి అద్భుత ఇన్నింగ్సే జట్టుకు మెరుగైన స్కోరు సాధించి పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రూ.2వేల నోట్లు వెనక్కి.. RBI కీలక నిర్ణయం
రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో చలామణీలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. (RBI to withdraw Rs 2000 currency note) ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే, ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ₹2 వేల నోట్లు ఇప్పుడు వాడుకోవచ్చా? ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చా?
రూ.2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ.. తమ వద్ద ఉన్న నోట్లను సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే, నోట్లు ఉపసంహరణపై ప్రజల్లో నెలకొనే పలు ప్రశ్నలు/సందేహాలకు ఆర్‌బీఐ సమాధానాలు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. BGMIకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. త్వరలో అందుబాటులోకి!
ప్రముఖ మల్టీప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) మరోసారి భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. పబ్‌జీ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ గేమ్.. గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రూ.2వేల నోట్ల ఉపసంహరణ.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావమెంత?
రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కరెన్సీపై ప్రజల్లో కాస్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా రూ.2వేల నోట్లు దాచుకున్న వారు కలవర పడుతున్నారు. బ్లాక్ మనీ బాబులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రూ.2వేల ఉపసంహరణ నిర్ణయంతో ఎవరికి నష్టం? ఎవరికి కష్టం? ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అనే దానిపై ఆర్థిక రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. దేశ చరిత్రలో.. ఆ ‘నలుగురు గుజరాతీ’ల సేవలు అమోఘం
ఆధునిక భారత చరిత్రలో నలుగురు గుజరాతీలు (Gujaratis) దేశానికి ఎంతో సేవచేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్‌లతోపాటు నరేంద్ర మోదీ (Narendra Modi).. దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. దిల్లీ గుజరాతీ సమాజ్ 125 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అమిత్ షా.. ప్రధాని మోదీ వల్లే భారత కీర్తి ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సముద్ర గర్భంలో భారీ భూకంపం.. పలు దేశాలకు సునామీ హెచ్చరికలు
పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయప్రాంతంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ పరిణామంతో సమీపంలోని ద్వీపదేశాలైన వనౌతు (Vanuatu), ఫిజీ (Fiji), న్యూకలెడోనియా (New Caledonia) దేశాలకు సునామీ (Tsunami) ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది. స్థానికులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. పల్లవోలో పడోవాతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం
భారతదేశపు ప్రీమియర్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, ఇటలీలోని సూపర్‌లిగాకు చెందిన ప్రముఖ క్లబ్ పల్లవోలో పడోవాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాబోయే నెలల్లో ఇటలీలో శిక్షణ కోసం బ్లాక్ హాక్స్ అనేక మంది ఆటగాళ్లను పంపుతుంది. ప్రతిగా, భారతదేశ మొట్టమొదటి ప్రపంచ స్థాయి కోచింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, యూత్ ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించడంలో బ్లాక్ హాక్స్‌కు సహాయం చేయడానికి పడోవా అక్కడి నుంచి నిపుణులైన కోచ్‌లను భారత్‌కి పంపుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భయానకం.. 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు..!
-
General News
Employee: ఆఫీసులో రోజుకి 6 గంటలు టాయిలెట్లోనే.. చివరకు ఇదీ జరిగింది!
-
India News
Wrestlers Protest: కోరిక తీరిస్తే.. ఖర్చు భరిస్తానన్నాడు: బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్లో కీలక ఆరోపణలు
-
Sports News
Ravi Shastri: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు నా ఎంపిక ఇలా..: రవిశాస్త్రి
-
General News
CM KCR: ఉద్యమానికి నాయకత్వం.. నా జీవితం ధన్యమైంది: కేసీఆర్
-
World News
US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా దేవ్‌షా..!