Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 19 Jun 2023 21:07 IST

1. అధికారం కోసమైతే నేను ఇంతలా కష్టపడాల్సిన పనిలేదు: పవన్‌ కల్యాణ్‌

ఆరో రోజు వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ఏటిమొగ్గలో ఆయన సోమవారం పర్యటించారు. ప్రత్యేక బోటులో ఉప్పుటేరు మీదుగా వెళ్లి స్థానిక జాలరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాలరులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. చేపల వేట విరామం వేళ ప్రభుత్వ జీవన భృతి అందడం లేదని వాపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమర్నాథ్‌ కుటుంబానికి తెదేపా రూ.10లక్షలు సాయం: చంద్రబాబు

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారిపాలెంలో దారుణ హ్యతకు గురైన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌ కుటుంబీకులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి తెదేపా తరఫున రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించారు. అమర్నాథ్‌ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నా కుటుంబ సమస్యను రాజకీయం చేయడం సరికాదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి

తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. తన మనోస్థైర్యం దెబ్బతీసే కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ముత్తిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అవన్నీ నకిలీ ఓట్లు కాబట్టే ఎవరూ ఫిర్యాదు చేయలేదు: ఏపీ సీఈవో

ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షల నకిలీ ఓట్లను తొలగిస్తే ఒక్క ఫిర్యాదూ రాలేదని ఏపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. అవన్నీ డూప్లికేట్‌ ఓట్లు కాబట్టే ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు రానున్న తరుణంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటరు కార్డుకు ఆధార్ కార్డును ఇంకా జత చేయలేదని.. కేవలం ఆధార్ సమాచారం మాత్రమే తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏవియేషన్‌ చరిత్రలో బిగ్‌ డీల్‌.. 500 విమానాలకు ఇండిగో ఆర్డర్‌

దేశ ఏవియేషన్‌ చరిత్రలో అతిపెద్ద డీల్‌. దేశీయ బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) 500 విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ (Airbus) నుంచి నేరో బాడీ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. టాటాలకు చెందిన ఎయిరిండియా (Air Indiai) ఎయిర్‌బస్‌, బోయింగ్‌ నుంచి 470 విమానాల ఆర్డర్‌ దేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్‌ కాగా.. తాజాగా దాన్ని ఇండిగో అధిగమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కేదార్‌నాథ్‌లో అపచారం.. ఆ మహిళపై చర్యలు తీసుకోండి

ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) హిమాలయాల్లో వెలసిన కేదార్‌నాథ్‌ ఆలయం (Kedarnath Temple) గర్భగుడిలో శివలింగంపై ఓ మహిళ కరెన్సీ నోట్లు చల్లడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆ మహిళపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది. అయితే, ఆ మహిళ ఎవరన్నది ఇంతవరకు తెలియరాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారీ అగ్నిప్రమాదం.. భయంతో కిందకు దూకేసిన ప్రజలు

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh )లోని కోర్బా జిల్లాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌ ప్రాంతంలోని ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భవనమంతా వ్యాపించాయి. దీంతో అందులో చిక్కుకున్న ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొందరు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇమ్రాన్‌ ఖాన్‌పై 140 కేసులు.. జైల్లో పెట్టినా తలవంచనన్న మాజీ పీఎం

తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినా లొంగిపోయే ప్రసక్తే లేదని పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు, ప్రజల కోసం తాను పోరాటం చేస్తున్నానని ఉద్ఘాటించారు. అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతోన్న ఆయన.. దేశంలో న్యాయపాలన కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 11వ శతాబ్దం నాటి మసీదును సందర్శించనున్న ప్రధాని మోదీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనకు సిద్ధమయ్యారు. అమెరికా పర్యటన అనంతరం అక్కడి నుంచి ఈజిప్టు (Egypt) చేరుకోనున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా 11వ శతాబ్దానికి చెందిన ఓ పురాతన ‘అల్‌- హకీం- మసీదు’ను సందర్శించనున్నారు. దావూదీ బోహ్రా వర్గం (Dawoodi Bohra community) వారు పునరుద్ధరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘అవార్డు రావడం గౌరవప్రదమే.. రూ.కోటి నగదు మాత్రం వద్దు!’

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గోరఖ్‌పుర్‌కు చెందిన గీతాప్రెస్‌ (Gita Press)కు కేంద్ర ప్రభుత్వం 2021 ‘గాంధీ శాంతి బహుమతి (Gandhi Peace Prize)’ని ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డు కింద రూ.కోటి నగదు, అభినందన పత్రం, జ్ఞాపిక, ప్రత్యేకమైన సంప్రదాయ హస్త కళాకృతులను అందించనుంది. అయితే, గీతాప్రెస్‌ సంస్థ రూ.కోటి నగదును తిరస్కరించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని