Jangaon: నా కుటుంబ సమస్యను రాజకీయం చేయడం సరికాదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి

తన ఇంటి సమస్యను రాజకీయం చేయడం సరికాదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కన్న కుమార్తెకు సొంత ఆస్తి ఇస్తే మోసం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

Updated : 19 Jun 2023 20:07 IST

జనగామ: తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. తన మనోస్థైర్యం దెబ్బతీసే కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ముత్తిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. 

‘‘నా కుటుంబ సమస్యను రాజకీయం చేయడం సరికాదు. నా కుమార్తెకు నా సొంత ఆస్తి ఇస్తే మోసం ఎలా అవుతుంది? తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ నేనే గెలుస్తా’’ అని ముత్తిరెడ్డి అన్నారు. ఇటీవల తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి.. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన పేరు మీద ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని ముత్తిరెడ్డి కుమార్తె భవానీ ఉప్పల్‌ ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాజాగా మరోసారి స్పందిస్తూ రాజకీయ ప్రత్యర్థులే కావాలని తన కుమార్తెను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు