Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 21 Jun 2023 21:11 IST

1. ‘నా వద్ద రూ.వేల కోట్లు.. సుపారీ గ్యాంగులు లేవు’: పవన్‌ కల్యాణ్‌

వైకాపా ప్రభుత్వం 70:30 ప్రభుత్వమని.. వంద మంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించారు. వైకాపా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు.. ఎవరు అర్హులంటే?

సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఈమేరకు రహదారులు, భవనాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. నియోజకవర్గానికి 3వేల చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు. స్టేట్‌ రిజర్వు కోటాలో 43వేలు, మొత్తంగా 4లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూరనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎమ్మెల్యే రాజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచి నవ్య

ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మరో నలుగురిపైనా ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌లో జానకీపురం సర్పంచి కురుసపల్లి నవ్య బుధవారం ఫిర్యాదు చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. నవ్య, రాజయ్య సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నాం: పొంగులేటి

తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని రేవంత్‌రెడ్డి ఆహ్వానించినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యోగాకు ఎలాంటి పేటెంట్‌, రాయల్టీలు లేవు: ప్రధాని మోదీ

యోగా (Yoga) ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందినది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. దీనికి ఎలాంటి కాపీరైట్‌, పేటెంట్‌, రాయల్టీలు లేవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Day of Yoga) సందర్భంగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం (United Nations) వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. NPSలో ఇక పెన్షన్‌పై హామీ.. కేంద్రం కీలక నిర్ణయం?

జాతీయ పింఛను పథకం (NPS)లో కీలక మార్పుల దిశగా నరేంద్ర మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. ఇకపై రిటైర్డ్‌ ఉద్యోగులకు నిర్దిష్ట మొత్తం పెన్షన్‌ అందేలా NPSలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న NPS విధానంలో నిర్దిష్ట పెన్షన్‌కు (Pension) ఎలాంటి హామీ లేదు. ఇప్పుడు ఉద్యోగి రిటైర్‌ అయ్యాక చివరి వేతనంలో 40 - 45 శాతం పెన్షన్‌గా అందుకునేలా NPSలో మార్పులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తమిళనాడులో 500 మద్యం దుకాణాలు మూసివేత

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 500 మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్టు ప్రభుత్వ రిటైలర్‌ టాస్మాక్‌  బుధవారం వెల్లడించింది. తొలి విడతలో పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న మద్యం అంగళ్లను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఎన్నికల సమయంలో  స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యోగా దినోత్సవం వేళ.. మోదీకి క్రెడిట్‌ ఇచ్చిన థరూర్‌

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశంసించారు. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ యోగాకు ప్రాచుర్యం కల్పించారంటూ కాంగ్రెస్ చేసిన ట్వీట్‌ను ఉద్దేశించి ఈ మేరకు స్పందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకు ప్రాచుర్యం కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన పండిట్ నెహ్రూకు కృతజ్ఞతలు. ఆయన దేశ విధానాల్లో దానిని భాగం చేశారు. మన మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఈ ప్రాచీన కళను మనం జీవితంలో భాగం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం’ అంటూ కాంగ్రెస్‌ ట్వీట్ పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ విషయాల్లో.. మోదీకి బైడెన్‌ ఉపదేశం చేయరు!

భారత్‌లో మానవ హక్కులపై (Human Rights) ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా ఇటీవల కొన్ని ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో, మానవ హక్కులు, మత స్వేచ్ఛ గురించి ప్రస్తావించాలని అమెరికా కమిషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలిజియస్‌ ఫ్రీడం వంటి సంస్థలు, కొందరు చట్టసభ సభ్యులూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ₹2000 నోట్లున్నాయా? Amazonలో మార్చుకోవచ్చు!

మీ దగ్గర రూ.2వేల నోట్లున్నాయా? (Rs 2,000 notes) ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత బయట ఎవరూ నోట్లను స్వీకరించడం లేదా? బ్యాంకుకు వెళ్లే తీరిక దొరకడం లేదా? అయితే మీకు అమెజాన్‌ (Amazon) అకౌంట్‌ ఉంటే మీరు సులువుగా మీ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవచ్చు. పైగా ఇంటి దగ్గరే మీరు ఆ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. నోట్ల మార్పిడి కోసం అమెజాన్‌ ఈ సౌకర్యం కల్పిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని