Ponguleti: తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నాం: పొంగులేటి

తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తన నివాసంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

Updated : 21 Jun 2023 17:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని రేవంత్‌రెడ్డి ఆహ్వానించినట్టు చెప్పారు. ‘‘ఉద్యమకారులు, ప్రజలు, కవులతో ఇప్పటికే చర్చలు జరిపాం. కొద్దిరోజుల్లోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాం. మూడు నాలుగు రోజుల్లో పార్టీలో చేరికపై ప్రకటన ఉంటుంది.  6 నెలల నుంచి పరిస్థితులను గమనిస్తున్నాం. నేను, జూపల్లి కలిసి తెలంగాణలో పర్యటిస్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చాక ప్రజల కలలు సాకారం కాలేదు’’ అని పొంగులేటి వివరించారు. 

మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ... ‘‘సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచామని చెబుతున్నారు. అవినీతిలోనా? మాట తప్పడంలోనా? స్కీమ్‌లు ఎత్తివేయడంలోనా? ఎందులో ఆదర్శం? ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వాగతిస్తాం.. కానీ, వాటి వెనుక జరిగిన అవినీతి ఎంత?. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరగకుండా ఉండి ఉంటే రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేది. నిరుద్యోగ భృతి ఇచ్చే వాళ్లం. రైతు రుణమాఫీ పూర్తయ్యేది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి ఫరిడవిల్లుతోంది. రైతాంగం గోస పడుతున్నారు’’ అని జూపల్లి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు