Shashi Tharoor: యోగా దినోత్సవం వేళ.. మోదీకి క్రెడిట్‌ ఇచ్చిన థరూర్‌

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ చేసిన ట్వీట్‌పై ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor) స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

Updated : 21 Jun 2023 23:29 IST

దిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) ప్రశంసించారు. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ యోగాకు ప్రాచుర్యం కల్పించారంటూ కాంగ్రెస్ చేసిన ట్వీట్‌ను ఉద్దేశించి ఈ మేరకు స్పందించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకు ప్రాచుర్యం కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన పండిట్ నెహ్రూకు కృతజ్ఞతలు. ఆయన దేశ విధానాల్లో దానిని భాగం చేశారు. మన మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఈ ప్రాచీన కళను మనం జీవితంలో భాగం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం’ అంటూ కాంగ్రెస్‌ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్‌పై స్పందించిన థరూర్(Shashi Tharoor).. కాంగ్రెస్ మాటలను అంగీకరిస్తూనే, యోగా విషయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వానికి క్రెడిట్ ఇచ్చారు. ‘మన ప్రభుత్వంతో సహా యోగాను పునరుద్ధరించి, ప్రాచుర్యం కల్పించిన వారిని గుర్తించాలి. కొన్ని దశాబ్దాలుగా నేను వాదిస్తున్నట్టుగా.. ప్రపంచవ్యాప్తంగా భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు యోగా కీలకమైన పాత్ర పోషిస్తోంది. దీనికి గుర్తింపు లభించడం గర్వంగా ఉంది’ అని అని వ్యాఖ్యానించారు.

థరూర్‌ ఇతర కాంగ్రెస్ నేతల్లా పార్టీపై కేవలం పొడగ్తలకే పరిమితం కాకుండా సూచనలు, హెచ్చరికలు చేస్తున్నారు. కర్ణాటక (Karnataka) గెలుపుతో కాంగ్రెస్‌ (Congress) సంతృప్తి చెంది ఉదాసీనంగా వ్యవహరించొద్దని అన్నారు. ఒక రాష్ట్రంలో గెలిస్తే.. దేశమంతా గెలుస్తామనే ఊహల్లో ఉండొద్దని అన్నారు. ఎన్నికలను బట్టి ప్రజలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారన్న ఆయన.. 2019 నాటి పరిస్థితులను ఉదాహరణగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని