Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 27 Jan 2023 21:06 IST

1. India-China: మరిన్ని ఘర్షణలు జరగొచ్చు : తాజా నివేదికలో ప్రస్తావన

వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా (China) కొన్నేళ్లుగా ఆక్రమణలకు పాల్పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవల డీజీపీల సదస్సులో సమర్పించిన ఓ నివేదికలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. భారత్‌- చైనా దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చని భారత్‌ అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. Hindenburg: అదానీ గ్రూపుపై ఆరోపణలు.. దర్యాప్తు చేయాల్సిందే : కాంగ్రెస్‌

అదానీ గ్రూపు (Adani Group) అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు అటు స్టాక్‌ మార్కెట్లతో పాటు రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI), రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI)తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, భద్రతలను నిర్దారించే బాధ్యత ఈ రెండు సంస్థలకు ఉన్నందున వీటిపై సీరియస్‌ దర్యాప్తు అవసరమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. Postal jobs: తపాలా శాఖలో 40,889 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?

పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధించారా? అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central government Job) పొందే అవకాశం మీకు ఉన్నట్టే. తపాలా శాఖ (Indian post)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ (Job notification) వచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో మొత్తం 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. Google: ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెచ్‌ఆర్‌కి లేఆఫ్‌..!

దిగ్గజ సంస్థ గూగుల్(Google) చేపట్టిన భారీ లేఆఫ్స్‌లో రోజుకో కొత్త స్టోరీ వెలుగులోకి వస్తోంది. తమ పనిలో నిమగ్నమై ఉండగానే ఉద్యోగం పోయినవాళ్లున్నారు. సంస్థ కోసం ఒకరిని ఇంటర్వ్యూ చేస్తోన్న సమయంలోనే హెచ్‌ఆర్‌ సిబ్బంది ఒకరు ఉద్యోగం కోల్పోయారని ఓ వార్త సంస్థ కథనం పేర్కొంది. రిక్రూట్‌మెంట్ విభాగంలో ఉన్నవారికి కూడా ఈ లేఆఫ్స్ గురించి తెలియకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. Pathaan: 32 ఏళ్ల తర్వాత అక్కడ హౌస్‌ఫుల్‌ బోర్డు.. ‘పఠాన్‌’ అరుదైన రికార్డు

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె నటించిన ‘పఠాన్‌’ (Pathaan) మరో అరుదైన ఘనత సాధించింది. కశ్మీర్‌ లోయలోని ఓ థియేటర్‌ బయట ఈ సినిమాకు హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టారట. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా. కశ్మీర్‌లో ఓ థియేటర్‌లో ఇలా హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టి 32 ఏళ్లు అయ్యిందట. ఈ నెల 25న విడుదలైన ‘పఠాన్‌’ ప్రభంజనం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. Go First Airways: 55 మందిని వదిలేసిన గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌కు భారీ జరిమానా

విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ (Go First Airways)కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) జరిమానా విధించింది. ఈ మేరకు రూ.10 లక్షలు చెల్లించాలని డీజీసీఎ స్పష్టం చేసింది. ఇటీవల గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ (Go First Airways)కు చెందిన G8 116 విమానం బెంగళూరు (Bengaluru) విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్‌ అయిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. Adani Stocks: అదానీ స్టాక్స్‌ అతలాకుతలం.. రూ.4 లక్షల కోట్ల నష్టం!

సంవత్సర కాలంగా అదానీ గ్రూప్‌ (Adani Group) స్టాక్స్‌ మదుపర్లను లాభాల్లో ముంచెత్తాయి. ఇదీ, అదీ అని కాకుండా స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన అదానీ స్టాక్స్‌ అన్నీ.. మదుపర్లకు మంచి లాభాలిచ్చాయి. ఈ లాభాల జైత్రయాత్రకు బుధవారం భారీ బ్రేక్‌ పడింది. షేర్ల విలువలు పెంచడంలో అదానీ గ్రూప్‌ (Adani Group) అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌ బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదికే దీనికి కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. CM KCR: కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిధర్‌ గమాంగ్‌తో పాటు పలువురు నేతలకు సీఎం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పి భారాసలోకి ఆహ్వానించారు. ఒడిశా మాజీ మంత్రి శివరాజ్‌ పాంగితో పాటు ఇతర నాయకులు భారాసలో చేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. One Plus - Cloud 11: వన్‌ప్లస్ నుంచి తొలి ట్యాబ్‌ వచ్చేస్తోంది... ఫీచర్లు ఇవేనా?

ఫ్లాగ్‌షాప్‌ ఫోన్ల విభాగంలో ఇన్నాళ్లూ మొబైల్స్‌ విడుదల చేస్తున్న వన్‌ ప్లస్‌ (Oneplus).. ఇప్పుడు ట్యాబ్స్‌ విభాగంలోకి కూడా వస్తోంది. ఫిబ్రవరి 7న జరగనున్న క్లౌడ్‌ 11 (Cloud 11) ఈవెంట్‌లో వన్‌ప్లస్ ప్యాడ్‌ (Oneplus Pad) పేరుతో ఈ ట్యాబ్‌ను విడుదల చేయనుంది. దీంతోపాటు వన్‌ప్లస్‌ 11 5జీ (OnePlus 11 5G), వన్‌ప్లస్‌ 11ఆర్‌ (OnePlus 11R), వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో (OnePlus Buds Pro), వన్‌ప్లస్ స్మార్ట్‌ టీవీ (OnePlus Smart TV)ని  కూడా తీసుకొస్తుంది. టెక్‌ వర్గాల అంచనాల ప్రకారం ఆయా డివైజ్‌ల స్పెసిఫికేషన్లు ఇలా ఉండొచ్చు.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. Telangana News: ఆ విద్యార్థులకు సువర్ణావకాశం.. TTWR COE సెట్‌కు నేటి నుంచే దరఖాస్తులు!

గిరిజన విద్యార్థుల బంగారు భవితకు బాటలు పరిచే TTWREIS - సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ ‌(ప్రతిభా కళాశాల)ల్లో ఇంటర్‌ (Intermediate) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాబోయే విద్యా సంవత్సరానికి తెలంగాణవ్యాప్తంగా ఉన్న 14 ప్రతిభా కళాశాలల్లో ప్రవేశాలకు తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (గురుకులం) జనవరి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని