One Plus - Cloud 11: వన్‌ప్లస్ నుంచి తొలి ట్యాబ్‌ వచ్చేస్తోంది... ఫీచర్లు ఇవేనా?

వన్‌ప్లస్‌ (Oneplus) ఫిబ్రవరి 7న క్లౌడ్‌ 11 (Cloud 11) పేరుతో ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో వన్‌ప్లస్‌ తన తొలి ట్యాబ్‌ (Oneplus Pad)ను విడుదల చేస్తోంది. దాంతోపాటు రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తుందని సమాచారం.

Published : 28 Jan 2023 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్లాగ్‌షాప్‌ ఫోన్ల విభాగంలో ఇన్నాళ్లూ మొబైల్స్‌ విడుదల చేస్తున్న వన్‌ ప్లస్‌ (Oneplus).. ఇప్పుడు ట్యాబ్స్‌ విభాగంలోకి కూడా వస్తోంది. ఫిబ్రవరి 7న జరగనున్న క్లౌడ్‌ 11 (Cloud 11) ఈవెంట్‌లో వన్‌ప్లస్ ప్యాడ్‌ (Oneplus Pad) పేరుతో ఈ ట్యాబ్‌ను విడుదల చేయనుంది. దీంతోపాటు వన్‌ప్లస్‌ 11 5జీ (OnePlus 11 5G), వన్‌ప్లస్‌ 11ఆర్‌ (OnePlus 11R), వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో (OnePlus Buds Pro), వన్‌ప్లస్ స్మార్ట్‌ టీవీ (OnePlus Smart TV)ని  కూడా తీసుకొస్తుంది. టెక్‌ వర్గాల అంచనాల ప్రకారం ఆయా డివైజ్‌ల స్పెసిఫికేషన్లు ఇలా ఉండొచ్చు. 

వన్‌ప్లస్ పాడ్ (OnePlus Pad)

‘ప్యాడ్‌’ టీజర్‌ ఫొటోను వన్‌ప్లస్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దాని ప్రకారం చూస్తే... ట్యాబ్‌ వెనుక భాగం, ముందు భాగంలో సింగిల్‌ కెమెరాలుంటాయి. అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ డివైజ్‌ను రూపొందించారట. ఇందులో 11.6 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. ట్యాబ్‌ కుడివైపు సైడ్‌లో టచ్‌ సెన్సర్‌, వాల్యూమ్‌ కంట్రోల్‌ బటన్స్ ఇస్తున్నారట. ట్యాబ్‌ ధర ₹ 35 వేల నుంచి ₹ 40 వేల మధ్య ఉండొచ్చని అంచనా. 

8 జెన్‌ ప్రాసెసర్లతో...

వన్‌ప్లస్‌ 11 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తుంది. వన్‌ప్లస్‌ 11ఆర్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1+ ప్రాసెసర్‌ను, వన్‌ప్లస్ 11 5జీలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 16 జీబీ/256 జీబీ వేరియంట్లలో ఈ మొబైల్స్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట. కెమెరా, డిస్‌ప్లేతోపాటు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

గూగుల్‌ స్పాషియల్‌తో...

వన్‌ప్లస్ స్మార్ట్‌ టీవీని 4K క్యూఎల్‌ఈడీ ప్యానెల్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో డాల్బీ అట్మాస్‌, విజన్‌ సపోర్ట్‌, 70 వాట్‌ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం. దీంతోపాటు వన్‌ప్లస్ బడ్స్‌ ప్రో ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేస్తోంది. ఇందులో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌,  గూగుల్ స్పాషియల్‌ ఆడియో సపోర్ట్‌ ఫీచర్లు ఉంటాయని సమాచారం. దీని ధర ₹ 10 వేలు ఉంటుందని భోగట్టా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని