Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. యాదాద్రి పవర్ ప్లాంట్.. దేశం కీర్తి ప్రతిష్ఠలు పెంచుతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు దేశం కీర్తి ప్రతిష్ఠలు పెంచుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ప్రభుత్వ రంగంలోనే దీని నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా?: ఏపీకి సుప్రీం ప్రశ్నల వర్షం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్పులో మరికొన్ని అంశాలు జోడించాలని వాటికి కూడా న్యాయం చేయాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కె.ఎం జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆమేఠీ నుంచి మళ్లీ పోటీ చేస్తారా? రాహుల్ సమాధానం ఇదే..!
దేశంలో పెరుగుతోన్న విద్వేషాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిలబడాలనే లక్ష్యంతోనే భారత్ జోడో యాత్ర మొదలుపెట్టినట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తన యాత్ర లక్ష్యం రాజకీయాలు కాదు.. దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తేవడమేనన్నారు. భారత్ జోడో యాత్ర దేశ ప్రజల వాణిని వినిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఈ యాత్ర కొనసాగుతున్న వేళ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. దిల్లీ ఎయిమ్స్‌పై హ్యాకర్ల పంజా.. ₹200 కోట్లకు డిమాండ్!
దేశ రాజధాని దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)పై హ్యాకర్లు పంజా విసిరారు. ఎయిమ్స్ నుంచి హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని వారు కోరుతున్నారని తెలిసింది. గత ఆరు రోజులుగా ఇక్కడి సర్వర్లు నిలిచిపోవడంతో ఆస్పత్రిలోని ప్రక్రియ అంతా మాన్యువల్‌గానే జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సెల్ఫ్ మెసేజ్.. మీ వాట్సాప్ నుంచి మీ నంబర్‌కు మెసేజ్ పంపొచ్చు!
వాట్సాప్ నుంచి స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు మెసేజ్‌లు పంపుతుంటాం. ఎప్పుడైనా..మీ వాట్సాప్ నుంచి మీకే.. అదేనండీ.. సెల్ఫ్ మెసేజ్ చేసుకున్నారా? డమ్మీ గ్రూపు క్రియేట్ చేయడం, థర్డ్‌పార్టీ పద్ధతుల్లో కాదు.. మీ వాట్సాప్ ఖాతా నుంచి మీ వాట్సాప్ నంబర్‌కే మెసేజ్ పంపారా? లేదు కదా? అయినా.. అదెలా సాధ్యం అంటారా? ఇకపై సాధ్యమే. ఇందుకోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. నాతో బూట్లు తుడిపించేవాడు.. పాక్ మాజీ కెప్టెన్‌పై వసీం అక్రమ్ సంచలన ఆరోపణలు
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ ఆ దేశ మాజీ కెప్టెన్ సలీం మాలిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను క్రికెటర్‌గా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలో సలీం తననో పనివాడిలా చూసేవాడని, తనతో బట్టలు ఉతికించి, బూట్లు తుడిపించేవాడంటూ ఆరోపించాడు. ఈ మేరకు తన జీవిత చరిత్ర ‘‘సుల్తాన్ ఎ మెమోయర్’’లో పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే.. కాంగ్రెస్‌కు అదొక్కటే దారి: మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే.. ఆ పార్టీ ‘విభజించు - పాలించు’ సిద్ధాంతాన్ని వదిలిపెట్టాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ట్విటర్ 2.0లో పేమెంట్స్, ట్వీట్‌లో 420 అక్షరాలు.. మస్క్ కొత్త ఆలోచన!
ట్విటర్ యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ట్వీట్‌లో అక్షరాల పరిమితిని 280 నుంచి 420కి పెంచునున్నట్లు సమాచారం. దీనిపై ట్విటర్ కొత్త బాస్ మస్క్ సైతం సానుకూలంగా స్పందించాడు. ఓ నెటిజన్ ‘‘ట్విటర్ 2.0లో అక్షరాల పరిమితిని 280 నుంచి 420గా మారుస్తారా?’’ అని ట్వీట్ చేయగా, ‘మంచి ఆలోచన’ అంటూ మస్క్ సానుకూలంగా బదులు ఇవ్వడంతో నెటిజన్లు దీనిపై చర్చించుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ముదురుతోన్న జనాభా సంక్షోభం.. రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్.. కొంతకాలంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న దేశ జనాభా.. ఈఏడాది కూడా రికార్డు స్థాయిలో క్షీణించింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జననాల సంఖ్య ఐదు శాతం క్షీణించిందని ప్రభుత్వం పేర్కొంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిస్థితేనని పేర్కొన్న జపాన్ ప్రభుత్వం.. వివాహాలు, జననాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. లై డిటెక్టర్ Vs నార్కో టెస్ట్.. ఏమిటీ పరీక్షలు..? నేర పరిశోధనలో ఎందుకంత ప్రాధాన్యం..?
దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ ఆమిన్ పూనావాలాకు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పాలిగ్రాఫ్ (Polyghraph) నిర్వహిస్తుండగా, నార్కో టెస్టు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో నేర పరిశోధనలో లై డిటెక్టర్ (Lie Detector), నార్కో అనాలసిస్ పరీక్షలు (Narco Test) ఎందుకంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి..? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: నా ప్రశ్నలకు ప్రధాని నుంచి సమాధానం రాలేదు: రాహుల్
-
General News
TSLPRB: దేహదారుఢ్య పరీక్షల్లో అనర్హులైన ఆ అభ్యర్థులకు మళ్లీ అవకాశం
-
Crime News
Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
-
Politics News
MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ