WhatsApp: సెల్ఫ్‌ మెసేజ్‌.. మీ వాట్సాప్‌ నుంచి మీ నంబర్‌కు మెసేజ్‌ పంపొచ్చు!

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్‌  ఖాతా నుంచి తమ నంబర్‌కే మెసేజ్‌ పంపొచ్చు.

Updated : 28 Nov 2022 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp) నుంచి స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు మెసేజ్‌లు పంపుతుంటాం. ఎప్పుడైనా..మీ వాట్సాప్‌ నుంచి మీకే.. అదేనండీ.. సెల్ఫ్‌ మెసేజ్‌ చేసుకున్నారా? డమ్మీ గ్రూపు క్రియేట్‌ చేయడం, థర్డ్‌పార్టీ పద్ధతుల్లో కాదు.. మీ వాట్సాప్‌ ఖాతా నుంచి మీ వాట్సాప్‌ నంబర్‌కే మెసేజ్‌ పంపారా? లేదు కదా? అయినా.. అదెలా సాధ్యం అంటారా? ఇకపై సాధ్యమే. ఇందుకోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మెసేజ్‌ యువర్‌సెల్ఫ్‌ (Message Yourself) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్‌ ఖాతా నుంచి తమకే మెసేజ్‌లు పంపొచ్చు. 

ఈ ఫీచర్‌ 1:1 పద్ధతిలో పనిచేస్తుందని వాట్సాప్ చెబుతోంది. దీంతో యూజర్లు నోట్స్‌ ప్రిపరేషన్, రిమైండర్స్‌ ప్లాన్‌ చేసుకోవడంతోపాటు షాపింగ్ లిస్ట్‌ను రాసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలో పూర్తిస్థాయి యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్‌ చెబుతోంది. వాట్సాప్ యాప్‌ ఓపెన్ చేసిన తర్వాత చాట్ మెసేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో మొదట మీ పేరు ఫోన్ నంబర్‌తోపాటు బ్రాకెట్‌లో యూ (You) అని ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి సెల్ఫ్‌ మెసేజ్‌ చేసుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని