Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 28 Jun 2023 20:59 IST

1. TSPSC Group 1 Prelims: గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌(Group 1 Prilims) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసింది. జూన్‌ 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. Moon Mission: చంద్రయాన్‌-3కి ముహూర్తం ఖరారు.. ప్రయోగం ఏ రోజంటే!

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగానికి ముహూర్తం ఖరారయ్యింది. జులై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు జాబిల్లి  వైపు దూసుకెళ్లనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ మిషన్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. Congress: జులై 2న ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభ.. హాజరుకానున్న రాహుల్‌గాంధీ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపు సభలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే ప్రకటించారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిళ్లగూడెంలో భట్టి పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. Rishi Sunak: రిషి సునాక్ ‘పెన్ను’పై వివాదం..!

బ్రిటన్‌ (Britain) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస విమర్శలను ఎదుర్కొంటున్న రిషి సునాక్‌ (Rishi Sunak).. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఉపయోగిస్తున్న ఓ పెన్నుపై నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అది ఎరేజబుల్‌ ఇంక్‌తో ఉన్న పెన్ను (Erasable Ink Pen) కావడమే అందుక్కారణం. ఇంతకీ ఏంటా పెన్ను..? దీనిపై వివాదం ఎందుకంటే..? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ENG vs AUS: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన నిరసనకారులు.. ఎత్తుకెళ్లి బౌండరీ అవతల పడేసిన బెయిర్‌ స్టో

లార్డ్స్‌ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా (ENG vs AUS) మధ్య బుధవారం యాషెస్‌ రెండో టెస్టు ప్రారంభమైంది. తొలి సెషన్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే మైదానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిరసనకారులు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో ఆటగాళ్లతోపాటు స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. AAP: ఉమ్మడి పౌరస్మృతికి ఆమ్‌ఆద్మీ మద్దతు.. కానీ.. ఓ షరతు..!

వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలంటూ ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code)పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో యూనిఫాం సివిల్‌ కోడ్‌కు తమ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు ఇస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ప్రకటించింది. కానీ, అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఇకపై బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌

ఇప్పటి వరకు ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌’ (mahila samman savings certificate) ఖాతాను పోస్టాఫీసుల్లో మాత్రమే తెరవడానికి మహిళలకు అవకాశం ఉండేది. ఇప్పుడు బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకంలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. Amazon sale: అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ తేదీలొచ్చాయ్‌.. ఈ కార్డులపై 10% డిస్కౌంట్‌

 ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ (Amazon) ఆఫర్ల పండగకు తెరలేపింది. జులై 15, 16 తేదీల్లో రెండ్రోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ (Amazon Prime Day 2023) నిర్వహించనుంది. ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. Adipurush: బుల్లితెరపై మరోసారి రామాయణం సీరియల్‌.. ‘ఆదిపురుష్‌’ ఎఫెక్టేనా..!

‘ఆదిపురుష్‌’..  ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఇందులోని డైలాగులు, పాత్రల వేషధారణలపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయణాన్ని సినిమా తీయాలనుకునే ముందు దాని ఆధారంగా రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన రామాయణం (Ramayan) సీరియల్‌ను ఓసారి చూడాల్సిందంటూ ఎంతోమంది కామెంట్స్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. H-1B Visa: హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌న్యూస్‌..

అమెరికాలో పనిచేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల (H 1B Visa)కు కెనడా (Canada) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్‌ వర్క్‌-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి సీన్‌ ఫ్రేజర్‌ వెల్లడించారు. అంతేగాక, ఈ ప్రొగ్రామ్‌ కింద హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు చదువుకోవడం, పనిచేసేందుకు అనుమతి కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని