Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 29 Jun 2023 21:10 IST

1. TSPSC Group 4 exam: గ్రూప్‌ 4 పరీక్ష రాస్తున్నారా? ఈ సూచనలు మరిచిపోవద్దు!

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్షకు(TSPSC Group 4 Exam) సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించే ఈ పరీక్షకు  లక్షలాది మంది విద్యార్థులు సర్వసన్నద్ధమై ఉన్నారు. ఇప్పటికే అధికారులు TSPSC Group 4 Hall tickets విడుదల చేశారు. జులై 1న జరిగే ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ ఇటీవల జారీ చేసిన కొన్ని కీలక సూచనల్ని మళ్లీ ఓసారి చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. Chandrababu: పటాన్‌చెరులో ఎకరం రూ.30కోట్లు.. ఏపీలో భూములకు ధరేది?: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రం గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి నరకం చూపించిన జగన్‌ను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదన్నారు. వైకాపాలోని చిన్న చేపలను  ఆపార్టీకి చెందిన పెద్ద చేపలే మింగేస్తున్నాయని దుయ్యబట్టారు.  తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు తెదేపాలో చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. Hyderabad: రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో శేజల్‌.. బ్యాగ్‌లో లేఖ లభ్యం

ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన  అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. శేజల్‌ బ్యాగ్‌లో నిద్రమాత్రలు, లేఖను గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కేబినెట్‌ విస్తరణ వార్తల వేళ.. జులై 3న మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ

త్వరలో కేంద్ర మంత్రివర్గం (Union Council of Ministers)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections 2023) నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జులై 3న  ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. Senthil Balaji: సెంథిల్‌ బాలాజీకీ షాక్‌.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన గవర్నర్‌

ఇటీవల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీకి గవర్నర్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆదేశాలు జారీ చేశారు. సెంథిల్‌ బాలాజీ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సెంథిల్‌ బాలాజీ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. Rahul Gandhi: గ్రనేడ్‌ దాడి జరిగే ప్రమాదం.. అందుకే రాహుల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నాం..!

దాదాపు రెండు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్(Manipur) ఉద్రిక్తంగా ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లారు. రాజధాని నగరం ఇంఫాల్‌ నుంచి ఘర్షణలకు కేంద్రబిందువైన చురాచాంద్‌పుర్‌కు బయలుదేరిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. గ్రనేడ్‌ దాడి జరిగే ప్రమాదం ఉందన్న అనుమానంతో తాము కాన్వాయ్‌ను ఆపివేశామని పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. Prigozhin: అసలు ప్రిగోజిన్‌ ప్లాన్ ఏమిటీ..?

రష్యా(Russia)లో తిరుగుబాటు చేసిన వాగ్నర్‌ బాస్‌ ప్రిగోజిన్‌ (Prigozhin)రక్షణశాఖలో ఇద్దరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొన్నాడని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ పేర్కొంది. వీరిని బంధించాలనే లక్ష్యంతో అతడు రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌లోని సైనిక స్థావరాన్ని ఆధీనంలోకి తీసుకొన్నాడని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. Cyber scam: కొరియర్‌ స్కామ్‌.. లక్షల్లో దోపిడీ.. ఎలా జరుగుతున్నాయంటే?

సైబర్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు పూటకో వేషం మార్చి దోచుకుంటున్నారు. కొత్త కొత్త పంథాలు అనుసరిస్తూ.. లక్షల్లో ఎగరేసుకుపోతున్నారు. ఇన్నాళ్లూ రకరకాలుగా మోసాలకు పాల్పడిన వారు.. ఇప్పుడు కొరియర్‌ పేరిట (courier scam) కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. ఇంతకీ ఏమిటీ మోసం? ఎలా చేస్తున్నారు? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. Ashwin: కోహ్లీ కళ్లలో పవర్‌ కనిపించింది.. ఒక్క బాల్‌ ఆడటానికి ఏడు ఆప్షన్లు ఇచ్చాడు: అశ్విన్‌

గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ (Pakistan)తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ కష్టకాలంలో కోహ్లీ  అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ చివరి ఓవర్లో జరిగిన హై డ్రామా గురించి అశ్విన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. Asylum Seekers: ఆ దేశాన్ని సురక్షితంగా పరిగణించలేం.. ‘శరణార్థుల కేసు’లో బ్రిటన్‌కు ఎదురుదెబ్బ!

అక్రమ వలసదారుల కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైన బ్రిటన్‌ (Britain) ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది! శరణార్థిగా ఆశ్రయం పొందాలనుకునేవారి (Asylum Seekers)ని ఆఫ్రికాలోని రువాండా (Rwanda) దేశానికి తరలించాలన్న ప్రభుత్వ ప్రణాళికను స్థానిక కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. వలసదారులను పంపగల సురక్షిత దేశంగా రువాండాను పరిగణించలేమని అప్పీల్‌ కోర్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని